Biker OTT Release: బైకర్ ఓటీటీ రిలీజ్.. శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా ఎందులో? ఎప్పుడు చూడొచ్చంటే?

యంగ్ హీరో శర్వానంద్, యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన మూవీ బైకర్. బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో, స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ తరహా మూవీ రావడం ఇదే తొలిసారి కావడంతో ఆడియన్స్ ఆసక్తి చూపించారు. గుడ్ ఫ్రైడ్ కానుకగా ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ప్రేక్షకులు డిస్కస్ చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

బైకర్ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా బైకర్ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ సంగీత దర్శకత్వం వహించగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బైకర్ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.

Biker OTT Release When And Where To Watch Sharwanand s Movie Online After Theatrical Run

బైకర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైకర్ మూవీకి 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. స్టార్ క్యాస్టింగ్‌కి తోడు, బైక్ రేసింగ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకురావడానికి నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. బైకర్ టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయని ఫీడ్ బ్యాక్ వస్తోంది.

బైకర్ ప్రీ రిలీజ్ బిజినెస్
హైప్‌కు తగినట్లుగానే బైకర్‌‌కు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ బాగానే బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. శర్వానంద్ మూవీకి నైజాం, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్‌ను 23 కోట్ల రూపాయలు చొప్పున ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నారు. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ హక్కులు కలిపి వరల్డ్ వైడ్‌గా బైకర్ మూవీ 30 కోట్ల రూపాయలు చొప్పున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బైకర్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.

ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి పరిశీలిస్తే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అలాగే మ్యూజిక్, శాటిలైట్ సహా అన్ని రైట్స్ కలిపి మరో 8 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. మొత్తం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి బైకర్ మూవీకి 70 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బైకర్ తొలిరోజు కలెక్షన్స్
బైకర్ మూవీకి తొలిరోజున ఇండియాలో 2.41 కోట్ల రూపాయల గ్రాస్.. 2.10 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. తెలుగులో 2.05 కోట్ల రూపాయలు, తమిళంలో 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్+ డే 1 కలెక్షన్స్ కలిపి 31K డాలర్లు (28.82 లక్షల రూపాయలు) వసూలు చేసింది. మొత్తంగా తొలి రోజున బైకర్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లుగా తెలుస్తోంది.

బైకర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?
థియేటర్‌లో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన మేరకు నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో లేదా మే 2వ వారంలో బైకర్ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే థియేట్రికల్ రన్‌ని బట్టి బైకర్‌.. ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు లేదా ముందుకు రావొచ్చని అంటున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

Read more about: sharwanand dr rajasekhar Biker
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X