Bigg Boss Non Stop Winner: బిగ్ బాస్ విన్నర్ పేరు లీక్.. ఆ కంటెస్టెంట్‌కే నాన్ స్టాప్ టైటిల్
ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందనను దక్కించుకుంటూ.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ స్థానంలో నిలుస్తోన్న షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో నడుస్తోన్నా దీనికి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించడంతో ఐదు సీజన్లు విజయవంతంగా ముగిశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ సైతం తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లోనే ఇందులో విజేత ఎవరో తేలిపోనుంది. దీంతో ప్రేక్షకులంతా దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విజేత వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఫినాలేలోకి ఏడుగురు ప్రవేశం
రెగ్యూలర్ బిగ్ బాస్ షోలో ఫినాలేకు ఐదుగురు మాత్రమే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో మాత్రం ఏకంగా ఏడుగురిని తుది పోరుకు పంపించారు. అందులో బిందు మాధవి, మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, ఆరియానా, శివలు ఉన్నారు. వీళ్లంతా ఈ సీజన్ టైటిల్ కోసం ఆరంభం నుంచే గట్టిగా పోటీ పడుతున్నారు.

జర్నీ వీడియోలు... ఎంజాయ్
ఆరంభం నుంచి సరికొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్.. ఇప్పుడు ఫినాలే వీక్‌లో ఉంది. ఇందులో కంటెస్టెంట్లకు టాస్కులు లాంటివి ఏమీ ఇవ్వడం లేదు. అంతేకాదు, అందరికీ సంబంధించిన జర్నీ వీడియోలను చూపించారు. అలాగే, గార్డెన్ ఏరియాలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాటలు కూడా ప్లే చేశారు. దీంతో కంటెస్టెంట్లు అందరూ ఎంజాయ్ చేశారు.

ఫస్ట్ డే షూట్.. వాళ్లంతా ఔట్
గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ గురువారమే ప్రారంభం అయినట్లు ఇప్పటికే అందరికీ తెలిసింది. ఆరోజు జరిగిన దాంట్లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్లను షో నుంచి ఎలిమినేట్ చేశారని కూడా ఓ న్యూస్ లీకైంది. అందులో ఏడో స్థానంలో నిలిచిన అనిల్ రాథోడ్, ఆరో స్థానంలో ఉన్న బాబా భాస్కర్, ఐదో స్థానంలో నిలిచిన మిత్రా శర్మ బయటకు వెళ్లిపోయారని తెలిసింది.

టైటిల్ కోసం వాళ్లిద్దరు పోటీ
నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఏకంగా ఏడుగురు ఫినాలేకు చేరుకున్నారు. కానీ, ఇందులో కేవలం ఇద్దరి మధ్యలోనే టైటిల్ పోటీ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకరు ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి కాగా, మరొకరు నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్. ఆరంభం నుంచే వీళ్లిద్దరూ చక్కని ఆటతీరుతో పాటు మైండ్ గేమ్ ప్రదర్శిస్తూ ఫినాలేకు చేరుకున్నారు.

ఓటింగ్ కూడా పోటాపోటీగానే
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విజేతను నిర్ణయించే ఓటింగ్ ప్రక్రియ గత బుధవారంతోనే ముగిసిపోయింది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. ఇందులో కొద్దిసేపు అఖిల్ సార్థక్ టాప్‌లో ఉంటే.. మరికాసేపు బిందు మాధవి మొదటి స్థానంలో నిలిచేది. ఇలా తరచూ వీళ్ల స్థానాల్లో మార్పులు కనిపించాయి. దీంతో విజేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ విన్నర్ పేరు లీక్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌కు సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ శుక్రవారం రాత్రే పూర్తైనట్లు తెలిసింది. గురువారం జరిగిన షూటింగ్‌లో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా.. తర్వాతి రోజు షూట్‌లో మిగిలిన వాళ్లను ఎలిమినేట్ చేయడంతో పాటు విజేతను కూడా ప్రకటించారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిందు మాధవి విజేతగా నిలిచిందట.

మరోసారి అతడికి నిరాశగానే
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఆడపులి బిందు మాధవి విజేతగా నిలిచినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నాలుగో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ ఈ సారి కూడా రెండో స్థానానికే పరిమితం అయ్యాడని అంటున్నారు. ఇక, అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకున్న యాంకర్ శివ మూడో స్థానంలో నిలిచాడని తెలిసింది. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.


Click it and Unblock the Notifications











