హీరోయిన్లను అలా అనడం చాలా తప్పు.. హ్యాపీగా ఇచ్చేయొచ్చు: బిందు మాధవి కామెంట్స్

ఆవకాయ్ బిర్యానీ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ బిందు మాధవి. తొలి సినిమాలో పద్ధతిగా కనిపించి ఆకట్టుకున్న ఈ బ్యూటి బంపర్ ఆఫర్ మూవీలో గ్లామర్ షో చేసి అట్రాక్ట్ చేసింది. తర్వాత కొన్ని తెలుగు చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. చాలా కాలం గ్యాప్ తర్వాత బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తోంది. తాజాగా న్యూసెన్స్ సిరీస్ కు ట్రైలర్ లాంచ్ లో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ తర్వాత: ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్, ఓం శాంతి, రామ రామ కృష్ణ కష్ణ, ప్రతి రోజు, పిల్ల జమిందార్ సినిమాలతో అలరించిన బ్యూటిఫుల్ బిందు మాధవి. ఈ మూవీస్ తర్వాత తమిళంలో బిజీగా మారింది. గతేడాది వచ్చిన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ లో విన్నర్ గా నిలిచి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ షోతో వచ్చిన ఫేమ్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది ఈ సుందరి.

Bindu Madhavi

మే 12 నుంచి అందులో: ఇటీవలే యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్న బిందు మాధవి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా సిరీస్ న్యూసెన్స్. హీరో నవదీప్ కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సిరీస్ కు ప్రవీణ్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ను ఆహాలో మే 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

Bindu Madhavi

నిజ సంఘటనలతో: ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మే 6న న్యూసెన్స్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది బిందు మాధవి. "నిజ సంఘటనల ఆధారంగా ఒక సినిమా కానీ, సిరీస్ కానీ వస్తే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అయితే మీడియాను తప్పు పట్టకుండా 2000 సంవత్సరంలో మదన పల్లిలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అది ఇంకాస్త ఇంట్రెస్ట్ పెంచుతుంది" అని బిందు మాధవి తెలిపింది.

Bindu Madhavi

అక్కడే పుట్టి పెరిగాను: "నా క్యెరెక్టర్ వచ్చేసి మదనపల్లిలో న్యూస్ రిపోర్టర్ నీలా. హైదరాబాద్ కు వెళ్లి పెద్ద ఛానెల్ లో రిపోర్టర్ గా చేయాలన్నదే తన డ్రీమ్. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను మదనపల్లిలో పుట్టి పెరిగాను. సాధారణంగా ఊరికెళ్తే 3, 4 రోజులు ఉండి వస్తాను. ఈ షూటింగ్ ద్వారా చాలా రోజులు ఉన్నాను. చాలా మెమోరబుల్ ప్లేసులో గడపడం చాలా సంతోషంగా ఉంది" అని బిందు మాధవి పేర్కొంది.

అది చాలా తప్పు: "మాములుగా అమ్మాయిలకు ఇస్తుంటారు గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అని. నిజానికి ఐరన్ లెగ్ అనేది వెరీ రాంగ్. అలా ఎవరికీ ఇవ్వకూడదు. ఇక ఈ గోల్డెన్ లెగ్ లో పీపుల్స్ మీడియా వాళ్లకు హ్యాపీగా ఇచ్చేయచ్చు. వాళ్ల ప్రొడక్షన్ లో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని షాకింగ్ కామెంట్స్ చేసిన బిందు మాధవి డైరెక్టర్ ప్రవీణ్, నవదీప్, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X