బాత్రూంలో అలాంటి పని.. ఎట్టకేలకు ఆ సంఘటనపై బిందు మాధవి ఓపెన్!
ఎట్టకేలకు చాలా కాలం క్రితం ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఈ శనివారం నాడు ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా బిందుమాధవి ఓటీటీ సీజన్ వన్ విన్నర్ గా నిలిచింది. ముందు నుంచి కూడా ఆమెకు అఖిల్ సార్థక్ తో గట్టిగా పోటీ ఏర్పడింది. అయినా సరే ఆమె తట్టుకుని కప్ గెలిచే వరకు పోరాడింది. మధ్యలో ఆమె సీక్రెట్ గా సిగరెట్లు తాగుతూ ఉంది అంటూ అఖిల్ అండ్ బ్యాచ్ కొన్ని పుకార్లు పుట్టించారు. తాజాగా బయటకు వచ్చిన బిందుమాధవి తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఆ విషయాల మీద నోరు విప్పింది. బిందుమాధవి ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే

బ్రేక్ అప్
తెలుగులో ఆవకాయ బిర్యాని అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బిందుమాధవి ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. అయితే ఆమెకు స్టార్ హోదా దక్కకపోవడంతో పాటు తమిళంలో అవకాశాలు రావడంతో అటు వెళ్ళిపోయింది. అలా తమిళ సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటూ ఆమె ముందుకు వెళ్ళింది. అయితే మధ్యలో ఒక బ్రేక్ అప్ కూడా జరగడంతో ఆమె సినీ పరిశ్రమకు కొంచెం దూరం జరిగింది.

అందరికీ షాక్
తమిళంలో ఒక బిగ్ బాస్ షోలో పాల్గొన్న టాప్ 5 కంటెస్టెంట్ గా ఫినాలే వరకు వెళ్ళింది కానీ కప్పు కొట్టలేకపోయింది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వర్షన్ నాన్ స్టాప్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మొదటి నుంచి టైటిల్ రేసులో నిలబడుతూ వచ్చింది. ఇప్పటివరకు లేడీ కంటెస్టెంట్ కప్పు కట్టకపోవడంతో ఆమె కూడా కప్పు కొట్టక పోవచ్చు అని అనుకున్నారు అందరూ, అయితే అనూహ్యంగా ఆమె కొట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

నట్రాజ్ మాస్టర్ కూడా
అయితే హౌస్ లో అన్ని కెమెరాలు ఉన్నా ఆ కెమెరాలకు కూడా కనపడకుండా అషు రెడ్డి, బిందుమాధవి సిగరెట్ తాగారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మిగతా కంటెస్టెంట్ లు. అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయి, బాత్రూంలో కూడా సిగరెట్ వాసన వస్తోందని నట్రాజ్ మాస్టర్ కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

స్మోకింగ్ చేస్తున్నారని
ఎలిమినేషన్ అయి బయటకు వచ్చిన తర్వాత అషు రెడ్డికి అదే ప్రశ్న ఎదురైతే ఆమె తెలివిగా తప్పించుకుంది. కానీ తాజాగా బిగ్ బాస్ విన్నర్ బిందుమాధవి ఫాన్స్ తో చేసిన లైవ్ షో లో కూడా అదే ప్రశ్న మరోసారి ఎదురైంది. మీరు స్మోకింగ్ చేస్తున్నారని స్రవంతి అఖిల్ తో పాటు అతని ఫ్రెండ్స్ కు చెప్పింది అది నిజమేనా అని ఒక అభిమాని అడిగితే దానికి బిందు మాదవి ఆసక్తికరంగా స్పందించింది.

అవసరం ఏముంది
తాను అసలు సిగరెట్ తాగ లేదని ఆమె స్పష్టం చేసింది. తనకు సిగరెట్ తాగే అలవాటు లేదు అని పేర్కొన్న బిందుమాధవి, ఒకవేళ ఉండి ఉంటే కనుక అందరి ముందే తాగుతాను కదా, అందులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించింది. మొత్తం మీద ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











