Bindu Madhavi : నటరాజ్ మాస్టర్ మోస్ట్ ఇరిటేటింగ్.. అతవి వల్లే కప్ కొట్టా!
తెలుగు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ విన్నర్‌గా తెలుగమ్మాయి, హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ షోలో బిందు మాధవిని షో వ్యాఖ్యాత నాగార్జున అక్కినేని విన్నర్ అని ప్రకటించారు. ఇక ఈ షోలో బుల్లి తెరపై ప్రసారమైన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆకట్టుకున్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరకు బిందు మాధవి విజేతగా నిలవడమే కాక బిగ్ బాస్ తెలుగులో చరిత్ర సృష్టించింది. ఇక ఆమె షో తరువాత యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు

గట్టి పోటీ
గతంలో బిగ్ బాస్ టీవీ షోలో అలరించి, టైటిల్ సాధించే దిశగా సాగిన పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్‌లోనూ కనిపించారు. అలా కొందరు సీనియర్స్ నుంచి బిందు మాధవికి గట్టి పొటీనే ఎదురైంది. అయినా కూడా వారందరినీ వెనక్కు నెట్టేసి, బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ వెర్షన్‌లో తొలి లేడీ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ముందు నుంచి కూడా అఖిల్ సార్థక్, బిందు మాధవి మధ్య గట్టి పోటీ నెలకొంది.

మంచి మద్దతు లభించి
అయితే టైటిల్ రేసులోకి వచ్చిన అఖిల్ సార్ధక్ ను డీ కొనే విషయంలో.బిందు మాధవికి ఒక అంశం బాగా కలిసి వచ్చింది. అదేమంటే బిందు మాధవి గాయంలో తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచే మద్దతు రాగా... బిందు మాధవికి మాత్రం తెలుగుతో పాటు తమిళం ఆడియన్స్ నుంచి కూడా మంచి మద్దతు లభించింది.

ఆసక్తికర విషయాలు
ఇక ఇంత కష్టపడినా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్ ప్రైజ్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. అయితే 'మస్తీ' హ్యాష్ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె 'ఆడపులి' అనే హ్యాష్ ట్యాగ్‌తో బయటికొచ్చింది. ఇక షో పూర్తయిన తరువాత బిగ్‌బాస్ బజ్‌లో యాంకర్ రవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నటరాజ్ మాస్టర్ అని
ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే బిగ్‌బాస్ టైటిల్ గెలవడం తన మొదటి విజయంగా భావిస్తున్నానని, ఇప్పటి నుంచి ఇక విజయవంతంగా ముందుకు వెళ్తానని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు విన్నర్ అయ్యారు కానీ, ఒకసారి కూడా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అని యాంకర్ అడగ్గా అది తనకు కూడా తెలియదని నవ్వుతూ చెప్పింది బిందు. హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా ఏ మాత్రం తడుముకోకుండా వెంటనే నటరాజ్ మాస్టర్ అని చెప్పేసింది బిందు.

వారి వళ్లే టైటిల్
అయితే ఈ సీజన్‌లో పలానా కంటెస్టెంట్ ఉన్నపపుడు నేను ఈ సీజన్‌కి రావాల్సింది లేకుండే అని ఎవరిని చూస్తే అనిపించింది? అని అడగ్గా వారి వళ్లే తనకీ టైటిల్ దక్కిందని ఆమె చెప్పుకొచ్చింది, కానీ పేరు మాత్రం బయట పెట్టలేదు. అయితే నాగార్జున గారు చేయి పట్టుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే చివరగా విన్నింగ్ మూమెంట్‌లో గెలుస్తానో, లేదో అని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానని బిందు పేర్కొంది.


Click it and Unblock the Notifications











