OTTని షేక్ చేస్తున్న బోల్డ్ కంటెంట్ మూవీ.. అలాంటి కోరికలున్న భార్య ఉంటే ఏం చేయాలి?

ఇటీవల కాలంలో ఓటీటీ సినిమాలకు మూవీ లవర్స్ అలవాటు పడిన సంగతి తెలిసిందే. ఇక అందుకు తగ్గట్లే ఓటీటీ సంస్థలు సైతం కొత్త కంటెంటును తీసుకువస్తున్నాయి. చాలా వరకు డైరెక్టుగా ఓటీటీల్లోనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల ఓటీటీలో డైరెక్టుగా ఓ మూవీ రిలీజ్ అయింది. బోల్డ్ కంటెంట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆ ఓటీటీని షేక్ చేస్తుంది. ఆ ఓటీటీలో టాప్ 10 మూవీస్ లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఆ సినిమా ఏంటి..? ఎందులో చూడాలి..? అంతలా ఎగబడి చూసేలా అందులో ఏముందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

బోల్డ్ కంటెంట్ మూవీ...

హారర్, మిస్టరీ, థ్రిల్లర్, ఇన్వేస్టిగేషన్... వీటికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే రొటిన్ మూవీస్ కు భిన్నంగా మరో కొత్త జోనర్లో ఓటీటీలోకి ఓ చిత్రం వచ్చేసింది. తొలిసారి తెలగు ఓటీటీలో బోల్డ్ కంటెంట్ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది. అదేంటో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఇటీవల ఆహా ఓటీటీలో తొలిసారి బోల్డ్ కంటెంటుగా తెరకెక్కిన మిక్సప్ తెలుగు మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు.

Bold Content Mixup Movie Trending Number 1 on Aha OTT Full Details Here

టాప్ 1లో ట్రెండింగ్...

బోల్డ్ కంటెంట్ చిత్రాలకు సైతం ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో ఇలాంటి మూవీస్ చూడాలంటే థియేటర్లలో వేసే షోస్ కోసం అప్పట్లో ఎగబడి చూసేవారు. ఇప్పుడు ఆ కష్టాలు లేకుండా ఓటీటీల్లో కూడా అలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక తెలుగులో ఇలాంటి సినిమాలు రావడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఆహా ఓటీటీలో మిక్సప్ బోల్డ్ కంటెంట్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో టాప్ 1లో కొనసాగుతోంది.

జరుగుతున్నవే చూపించారు...

మిక్సప్ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్ నుంచి ట్రైలర్స్ వరకు బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆ చిత్రానికి ఆహా ఓటీటీ బాగానే ప్రమోషన్స్ చేపట్టింది. అందుకే సినిమా స్ట్రీమిగ్ మొదలైనప్పటి నుంచి తెగ ట్రెండ్ అవుతూ వస్తుంది. మార్చి 15 నుంచి మిక్సప్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆహా ఒరిజనల్స్ లో భాగంగా ఈ చిత్రం ఓటీటీలో డైరెక్టుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ చిత్రంలో ప్రస్తుతం సమాజంలో జరిగినవి, జరుగుతున్నవే చూపించారు.

Bold Content Mixup Movie Trending Number 1 on Aha OTT Full Details Here

ఓ మెసెజ్ కూడా ఇచ్చారుగా...

అయితే ఇందులో బోల్డ్ కంటెంటు మాత్రమే కాదు.. ఓ మెసెజ్ కూడా ఇచ్చారు. మంచిని చెప్పడానికి కూడా కాస్త బోల్డ్ మార్గాన్ని ఎంచుకోక తప్పదని ఈ సినిమా రుజువు చేసింది ఈ చిత్రం. మరి మీరు ఈ సినిమాను మీ పార్టనర్ తో లేదా ఒంటరిగా చూడటమే బెటర్. ఇక ఈ బోల్డ్ కంటెంట్ మిక్సప్ సినిమాను మీరు ఇప్పటికే చూసి ఉంటే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X