OTTలోకి డైరెక్ట్‌గా బోల్డ్ కంటెంట్ మూవీ.. ఒక్కో సీన్ అరాచకం.. ఇక కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే!
ఓటీటీలోకి ప్రేక్షుకల అభిరుచికి తగ్గట్టుగా ఎన్నో కంటెంట్ ఉన్న సిరీస్‌లు, సినిమాలు వస్తున్నాయి. వాటికి మంచి ప్రేక్షకాదరణ కూడా బాగా దక్కతోంది. అలా తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అయితే అది కూడా పక్కా యూత్ ఆడియెన్స్, కొత్తగా పెళ్లైన వారిని టార్గెట్ చేస్తూ బోల్డ్ కంటెంట్‌తో వచ్చింది. నేడు దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలై ఆసక్తిని రేపుతోంది. ఇంతకీ ఈ చిత్రం ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో వివరాలను తెలుసుకుందాం..
రూట్ మార్చిన ఆహా
తెలుగులో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్న ఓటీటీ ఆహా. నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో తెలుగు సినిమాలతో పాటు మనసును హత్తుకునే పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే తొలిసారిగా ఆహా రూట్ మార్చింది. ఓ సరికొత్త బోల్డ్ కంటెంట్ మూవీని డైరెక్ట్‌గా రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. అదే మిక్స్ప్. ఊహించని ట్విస్ట్‌లు, ప్రేమ, సెక్స్ ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

మిక్సప్ మూవీ టీజర్ రిలీజ్
ఈ బోల్డ్ మూవీ మిక్స్ప్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. టీజర్ ప్రారంభంలోనే హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని సజెస్ట్ చేశారు మేకర్స్. ఎందుకంటే ఆ టీజర్ పక్కా బోల్డ్ సీన్స్‌తోనే ప్రారంభమైంది. కమల్ కామరాజు బెడ్ మీద పడుకుని ఉంటే.. అతని భార్య కొరడాతో కొడుతూ తన కామ వాంఛను తీర్చుకుంటుంది. నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్ మెంట్ కావాలి.. ఎంటర్ టైన్మెంట్ కావాలి అంటూ రెచ్చిపోతుంది. మరోవైపు నేను నీ మొగుడిని నాకు ఇష్టం ఉన్నప్పుడు ముట్టుకునే హక్కు నాకు ఉంటుందని అంటూ నటుడు ఆదర్శ్ తన భార్యతో చెప్పడాని చూపించారు. అప్పుడూ ''రోజూ అదే పార్టనర్ తో చేస్తే బోర్ కొట్టదా'', ''మ్యారెజ్ అన్నాకా సెక్సువల్ శాటిస్ ఫ్యాక్షన్ అవసరం'' అంటూ మొత్తం టీజర్‌ను బోల్డ్ కంటెంట్ అండ్ బోల్డ్ డైలాగ్స్‌తో నింపేశారు.
ఆహాపై కామెంట్స్...
ఇక ఈ టీజర్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు ఓటీటీలో ఇలాంటి కంటెంట్ మూవీ అవసరమా, అల్లు రూట్ మార్చి ఉల్లు కంటెంట్‌ను రిలీజ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్లతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా కన్నడ హీరోయిన్ అక్షర గౌడ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అక్షర గౌడతో పాటు ఆదర్శ్ బాలకృష్ణన్, కమల్ కామరాజు, పూజా జవేరి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
బోల్డ్ కంటెంట్ తో సక్సెస్
ఇకపోతే అక్షర గౌడ్ తెలుగులో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో దళపతి విజయ్‌తో తుపాకీ, అజిత్ హీరోగా నటించిన ఆరంభం సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇంకా రామ్ పోతినేని ది వారియర్, సుధీర్‌బాబు హరోంహరలోనూ నటించింది. ఇక ఇప్పుడు బోల్డ్ కంటెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ కొట్టాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











