OTTలోకి విజయ్ 69 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మరొ కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒరిజినల్ కంటెంటును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఈ ఓటీటీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అయితే తాజాగా విజయ్ 69 అనే చిత్రాన్ని తీసుకురాబోతుంది. విజయ్ 69 అంటే దళపతి నటిస్తున్న నటిస్తున్న 69 అనుకుంటే పొరపాటే. ఇది వేరే ప్రాజెక్టు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్న ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. అసలు ఈ సినిమా కథేంటి.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినిమా ప్రేక్షకుల కోసం ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ తో ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయంగా అలరిస్తున్న ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒకటి. ఇందులో ఒకప్పుడు ఇంగ్లీషు సినిమాలు, విదేశీ భాషల సినిమాలు ఉండేవి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎప్పుడైతే బాహుబలితో రాజమౌళి తన సత్తాను ప్రపంచానికి తెలియజెప్పాడో.. అప్పుడు నెట్ ఫ్లిక్స్ వంటి విదేశీ ఓటీటీ సంస్థలు కూడా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఒరిజినల్ కంటెంట్ సినిమాలు, సిరీసులు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటుంది. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగానే నెట్ ఫ్లిక్స్.. సినిమాలు, సిరీసులు తీసుకువస్తుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరో కొత్త ప్రాజెక్టును తీసుకురాబోతుంది. దేశంలోని ప్రముఖ బ్యానర్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ తన డిజిటల్ విభాగమైన YRF ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇటీవల YRF ఎంటర్‌టైన్‌మెంట్ వారు ది రైల్వే మెన్ సిరీసుతో ముందుకు రాగా ఆ సిరీసుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీసు రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రశంసలు అందుకుంది ఈ సిరీసు. ఇక YRF ఎంటర్టైన్మెంట్ నుంచి మరో చిత్రం రాబోతుంది. అదే విజయ్ 69. ఈ సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుంది.

విజయ్ 69 అనే సినిమాను తమ ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు "నెక్స్ట్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా" ఈవెంట్‌లో నెట్ ఫ్లిక్స్ చెప్పుకువచ్చింది. ఈ చిత్రంలో బహుముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ 69 అనేది స్లైస్-ఆఫ్ లైఫ్ చిత్రం. ఇది 69 ఏళ్ల వయసులో ట్రయాథ్లాన్ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్న వ్యక్తి గురించి ఉంటుందని సమాచారం. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్ట్ చూస్తే కూడా అర్థం అవుతుంది.
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేరీ ప్యారీ బిందు చిత్రానికి దర్శకత్వం వహించిన అక్షయ్ రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ 69 చిత్రాన్ని మనీష్ శర్మ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ తో పాటు చుంకీ పాండే కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











