OTTలోకి రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ రొమాంటిక్ వెబ్ సిరీస్.. ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
రోజురోజుకూ ఓటీటీల జోరు ఎక్కువ అవుతోంది. నిన్న, మొన్నటి వరకు టీవీలూ చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన వారంతా ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటుండడంతో.. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఆలోచనతోనే వచ్చిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే ప్రధాన పాత్రలో ఓ క్రేజీ వెబ్ సిరీస్ ను తీసుకు రాబోతున్నారు. ముఖ్యంగా కాల్ మీ బే అనే పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో.. అనన్యా పాండేతో పాటు విహాన్ సమత్, వరుణ్ సూద్, గుర్ఫాతే పిర్జాదా, వీర్ దాస్, మినీ మాథుర్, నీల కొఠారి, దీక్షా జునేజా, జుహీ బాబర్, తారా శర్మ, హార్ధిక శర్మ, వరుణ్ ధావన్, శివిన్ నారంగ్ వంటి వాళ్లంతా నటించి మెప్పించబోతున్నారు.

కరణ్ జోహార్, అపూర్వ మెహతా మరియు సోమెన్ మిశ్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లుగా పనిచేస్తున్న ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. అలాగే దీనిక్ కొలిన్ డి కున్హా దర్శకత్వం వహిస్తున్నారు. సమీనా మోట్లేకర్, రోహిత్ నాయర్‌లతో కలిసి ఈ వెబ్ సిరీస్‌కి ఇషితా మోయిత్రా సహ రచయితగా పని చేశారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ అసలు కథ ఏంటంటే..?
బే (అనన్యా పాండే) ఒక బిలియనీర్ కుటుంబానికి చెందింది. కానీ ఓ కుంభకోణం కేసులో ఇరుక్కున్న ఈమె కుటుంబ సభ్యులే వెలివేస్తారు. అలా ఆమె తనను తాను రక్షించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని క్షుణ్ణంగా ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ఈక్రమంలోనే ఆమె తన గురించి తాను పూర్తిగా తెలుసుకుంటుంది. అద్భుతమైన కథతో అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీ విడుదల తేదీని రివీల్ చేశారు.
ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా కాల్ మీ బే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను కచ్చితంగా చూడాల్సిందే. అదిరిపోయే రొమాంటింక్ థ్రిల్లర్ అయిన ఈ వెబ్ సిరీస్ ను ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే కూర్చుని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











