OTTలోకి వచ్చేసిన హిందీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. తెలుగులో కావాలంటే అక్కడ చూసేయండి!
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ ఓటీటీలో అనేక సినిమాలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ హాలీడేస్ కావడంతో.. ఎక్కువగా ఓటీటీల్లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న ఓటీటీ సంస్థలు అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలను కూడా అన్ని భాషల్లోకి అనవదించి మరీ అందిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సినిమా. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాను తెలుగులో అందుబాటులోకి తెచ్చారు. ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా చేసిన OMG 2 ఓ మై గాడ్ 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి, అరుణ్ గోవిల్ తదితరులు నటించారు. విపుల్ షా నిర్మాతగా కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఓ మై గాడ్ సినిమా రిలీజ్‌కు ముందు అనేక వివాదాల్లో కూరుకుపోయింది. ఈ సినిమా విడుదలను ఆపేయాలని చాలా మంది చూడగా.. ఎట్టకేలకు విడుదుల అయింది.

మొత్తం 27 కట్లతో ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిర్ణయించింది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించిన ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన తేదిన విడుదల చేశారు. సెక్స్ ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్‌తో పెద్దలకు మాత్రమే అనే కండిషన్‌తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కొంతకాలానికే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయింది. అయితే ఆరు నెలలుగా ఈ సినిమా తెలుగులో కూడా వస్తే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాంటి వాళ్లకోసమే అన్నట్లుగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేరుగా ఓటీటీలోకి తీసుకు వచ్చింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్ వేదికగా అందుబాటులో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ మెప్పించిన ఈ సినిమాను తెలుగులో చూడాలనుకునే వాళ్లు వెంటనే చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి.


Click it and Unblock the Notifications











