OTTలోకి వందలకోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ పిరియాడికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కరోనా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ డీలా పడిపోయింది. ఇక అప్పుడు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ హిట్ తర్వాత ఆ స్థాయి హిట్ అందించింది మాత్రం బాలీవుడ్ సీనియర్ హీరో సన్ని డియోల్. ఆయన నటించిన తాజా చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురించింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఆ వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ స్టార్ హీరో సన్ని డియోల్ నటించిన తాజా చిత్రం గదర్2. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దకు ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 11న థియేటర్లకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. 2001లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన గదర్: ఏక్ ప్రేమ్ కథ. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 తెరకెక్కింది.

Gadar 2

గదర్: ఏక్ ప్రేమ్ కథ సినిమా 1947లో పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా రూపొందింది. ఇక ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా.. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన గదర్ 2 సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లు రాబట్టింది.

ఇక గదర్ 2 సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. అభిమానులకు జీ5 ఓటీటీ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పిది. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సినిమా ఓటీటీ విషయంలో గతంలో ఆరు నెలల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని దర్శకుడు కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఓటీటీ సంస్థ ప్రకటించండంతో మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆగస్టు 11న రిలీజ్ అయిన గదర్ 2.. రెండు నెలలు లోపే.. జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ మూవీ మేకర్స్ సక్సెస్ పార్టీ జరుపుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. గదర్ 2 మూవీ 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈసారి తన కుటుంబం, తన దేశం కోసం తారా సింగ్ శత్రువులతో పోరాడటం ఈ మూవీలో చూడొచ్చు.

ఇక గదర్ సినిమా విషయానికి వస్తే... టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.550 కోట్లు వసూలు రాబట్టింది. గదర్ 2 బ్లాక్ బస్టర్ కావడంతో... గదర్ 3 కూడా రాబోతున్నట్లు సమాచారం. ఇక మీరు గనుక ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామాను థియేటర్లలో మిస్ అయితే గనుక ఓటీటీ జీ5లో అక్టోబర్ 6న చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X