OTTలోకి లేటెస్ట్ పిరియాడిక్ బ్లాక్ బస్టర్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీకి తిరిగి పూర్వ వైభవం తెచ్చిన సినిమా పఠాన్. ఇక ఈ చిత్రం తర్వాత మళ్లీ బాలీవుడ్ ఆ స్థాయి హిట్ అందుకోలేదు. ఇక ఇటీవల సీనియర్ హీరో సన్ని డియెల్ నటించిన గదర్ 2... ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ చిత్రం... బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోతను కోసింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఎక్కడ, ఎప్పుడు అనేది ఈ స్టోరీలోతెలుసుకుందాం.

బాలీవుడ్ లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన గదర్: ఏక్ ప్రేమ్ కథ. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రొమాంటిక్ యాక్షన్, పిరియాడిక్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 1947లో పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాకు అనిల్ శర్మ డైరెక్టర్ గా వ్యవహారించారు. 2001 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా.. అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.

గదర్ సినిమాకు 2023లో సీక్వెల్ గా గదర్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు నుంచి ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ.. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

2001లో వచ్చిన గదర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.450 కోట్లను వసూళ్లు చేసింది. రూ.500 కోట్లకు చేరువగా అడుగులు వేస్తోంది గదర్ 2. ఇప్పటికే గదర్ 2 ధాటికి బాహుబలి, కేజీఎఫ్, పఠాన్ లాంటి సినిమాల రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.
ఇక ఈ నేపథ్యంలో గదర్ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ చెప్పాలంటూ నెటిజన్లు అడగ్గా.... వీటిపై డైరెక్టర్ అనిల్ శర్మ రియాక్ట్ అయ్యారు. గదర్ 2 ఓటీటీ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ అనిల్ శర్మ ఏం చెప్పారంటే... ప్రస్తుతం ఆడియెన్స్ 'గదర్2′ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ ట్రెండ్ కొనసాగవచ్చు. నాకు తెలిసినంత వరకు మరో ఆరునెలల తర్వాతే గదర్ 2 సినిమా ఓటీటీలోకి వస్తుంది. అప్పటివరకు మా సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే చూస్తారని అనుకుంటున్నా' అని చెప్పారు. ఈ న్యూస్ విన్న నెటిజన్స్ ఏంటీ.. ఈ మూవీ మరో ఆరు నెలల వరకు ఓటీటీలోకి రాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











