నేరుగా OTTలోకి రాబోతున్న రియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ భక్షక్.. డేర్ ఉంటేనే చూడండే!
రోజురోజుకూ ఓటీటీ వేధికగా వచ్చే సినిమాల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. థియేటర్లలో కంటే కూడా ఓటీటీ వేధఇకగా విడుదల చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న చిత్రాలు కావడమో, థియేటర్లు దొరక్క పోవడం వల్లో, పోటీనీ తట్టుకోలేకపోవడం వల్లనో ఓటీటీ వేధికగా రావాలని చూస్తున్నారు. ముఖ్యగా హర్రర్, థ్రిల్లర్ సినిమాలు అయితే ఎక్కువగా ఓటీటీ వేధికగా వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. థియేటర్లో విడుదల అయిన ఇలాంటి సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చి ఓటీటీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఓ అద్భుతమైన రియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమే భక్షక్. అయితే ఈ సినిమాలో గతంలో తెలుగులో వచ్చిన సీఐడీ సీరియల్ నటుడు కూడా ఉన్నాడు. ఆయన అభిజీత్. సీఐడీ ఆఫీసర్ గా అద్భుతంగా నటిస్తూ అందరినీ అలరించిన ఆయన తాజాగా ఈ సినిమాలో నటించి మెప్పించేందుకు సిద్ధం అయ్యారు. అయితే తెరపై ఈయన పేరు అభిజీత్ కాగా... రియల్ పేరు మాత్రం ఆదిత్య శ్రీవాస్తవ. అయితే పులకిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భూమి పెడ్నేకర్ లీడ్ లో రోల్ లో కనిపించనున్నారు.

అలాగే అదిత్య శ్రీవాత్సవ, సాయి థమకర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేధికగా ఫిభ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా చిత్రబృందం ఈ భక్షక్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తుందని అనిపిస్తుంది.

అయితే ఈ సినిమాను వాస్తవ సంఘటనల ఆఘారంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ లో చూపించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాల గురించి ఈ సినిమాలో ప్రధానంగా చర్చించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఈ సినిమా ఓ పవర్ ఫుల్ జర్నలిస్టుగా కనిపించున్నారు. అయితే చిన్నారులపై, మహిళలపై నేరాలు జరగటాన్ని ఈమె ఎలా గ్రుతంచింది, ఎలా వెలుగులోకి తీసుకు వచ్చిందనేది సినిమా అసలు కథ. ఆద్యంతం ఆకట్టుకునేలా అద్బుతమైన ట్విస్ట్ లతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే ఫిభ్రవరి 9వ తేదీ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











