Munjya on OTT: ఓటీటీలో కోట్లు కుమ్మేసిన హారర్ సినిమా.. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

ఈ ఏడాదిలో మన ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన సక్సెస్ లు ఒకింత తక్కువే ఉన్నాయని చెప్పాలి. యావరేజ్ గా 100 సినిమాల్లో ఈ ఏడాదికి కేవలం 10 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలు అందిస్తే అది గగనమే అనుకోవాలి. కానీ ఉన్న కొన్ని హిట్స్ లో కూడా అవి మామూలుగా సంచలనం సెట్ చేసినవి కూడా లేకపోలేవు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే హారర్ జానర్ లో వచ్చిన సినిమాలు ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ చేసాయి.

రీసెంట్ గా వచ్చిన "స్త్రీ 2" సినిమా అయితే రికార్డులు తిరగరాసి బాలీవుడ్ సినిమా దగ్గర కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా మొదటిసారిగా ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా బాలీవుడ్ లాంటి బిగ్ ఇండస్ట్రీలో 600 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. ఇలా హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇండియన్ సినిమా దగ్గర ఒక కనీ వినీ ఎరుగని రికార్డుని సెట్ చేసుకుంది.

bollywood small film which became big hit munjya in telugu in this ott

అయితే దీనికి ముందు ఇదే సినిమా యూనివర్స్ కి లింక్ అయ్యి ఉన్న మరో హారర్ సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కాగా ఆ చిత్రమే "ముంజ్య". బాలీవుడ్ లో అసలు సినిమాలు పెద్దగా రాణించడం లేదు అనే సమయంలో పెద్దగా అంచనాలు అనేవి లేకుండానే ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. ఇలా వచ్చి ఒక షాకింగ్ హిట్ గా నిలిచింది.

హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ చిత్రం సర్ప్రైజింగ్ గా 100 కోట్లకి పైగా భారీ వసూళ్లు అందుకొని చిన్న సినిమాలు విజయం అందుకుంటాయి కదా ఆ ట్యాగ్ లైన్ కి పర్ఫెక్ట్ నిర్వచనంగా నిలిచింది. హిందీలో లాంగ్ రన్ లో దూసుకెళ్లిన ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ కూడా మాట్లాడుకున్నారు. సరే ఎలాగో ఓటిటిలో తెలుగులో వస్తే చూద్దాం అని చాలా మంది అనుకున్నారు కానీ ఈ చిత్రం కేవలం హిందిలో మాత్రమే ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది.

bollywood small film which became big hit munjya in telugu in this ott

కాగా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో తెలుగు ఆడియెన్స్ ని కూడా అలరించేందుకు వచ్చేసింది. ఇంతకీ ఈ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే.. ఒరిజినల్ గా హిందీని కూడా స్ట్రీమ్ చేస్తున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే ఇప్పుడు మేకర్స్ తెలుగు సహా తమిళ్ భాషల్లో కూడా పొందుపరిచారు. దీనితో ఈ చిత్రం ఇపుడు మూడు భాషల్లో ఓటిటిలో అందుబాటులో ఉంది.

మరి అప్పుడు నుంచి తెలుగు వెర్షన్ లో ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అయితే ఇక హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేసేయొచ్చు. కాగా ఈ సినిమాలో అభయ్ వెర్మ, శర్వరి, భాగ్యశ్రీ లిమావే, సత్యరాజ్ తదితరులు నటించగా దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కించారు. 30 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం 132 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని భారీ హిట్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X