NBK's Unstoppable బాలకృష్ణ షోలో బాలీవుడ్ సూపర్ స్టార్..ఎప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ ఇమేజ్‌ను పూర్తిగా మార్చి వేసిన రియాలిటీ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK). అన్‌స్టాపబుల్ షో దెబ్బకు అందరి మైండ్ సెట్ మారిపోయేలా చేశాడు. రెండు సీజన్లుగా సాగిన ఈ టాక్ షో దేశంలోనే టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ షో మూడో సీజన్ యాక్టివ్‌గా లేకపోయినా.. సందర్బోచితంగా కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నారు. తాజాగా బాలయ్య షోలో బాలీవుడ్ స్టార్ హీరో రావడం ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపింది. ఆ బాలీవుడ్ హీరో ఎవరనే వివరాల్లోకి వెళితే...
నటసింహం బాలకృష్ణ 2021 సంవత్సరం నవంబర్ 4వ తేదీన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) ప్రారంభమైంది. మోహన్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, రానా దగ్గుబాటి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, బోయపాటి, శ్రీలీల లాంటి ప్రముఖులు వచ్చారు.

ఇక అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) IBDB వెబ్‌సైట్‌లో టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ షో ఆహా యాప్‌లో తొలి సీజన్ 550 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్, రెండో సీజన్ 850 స్ట్రీమింగ్ మినిట్స్‌ను ఓటీటీలో వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. ఇప్పటికీ ఈ షో టాప్ రేటింగ్‌తోనే కొనసాగుతున్నది.
అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) షోలో కోసం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎపిసోడ్‌లో రష్మిక మందన్న, సందీప్ రెడ్డి వంగా తో కలిసి పాల్గొన్నారు.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) షోలో పాల్గొన్న రణ్‌బీర్ కపూర్‌ను తనదైన శైలిలో ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం. యానిమల్ సినిమా ప్రత్యేకతలను అడిగి తెలుసుకొన్నారు. త్వరలోనే ఈ టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది.త్వరలోనే అధికారికంగా డేట్‌ను ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications











