నెలన్నర కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా.. ఎక్కడ చూడాలో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అయితే గత 35 సంవత్సరాలుగా అద్భుతమైన సినిమాలు తీస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీసును షేర్ చేస్తున్నాడు. గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించినప్పటికీ ఈ మధ్య మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోతున్నారు. ఈక్రమంలో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలనే ఆలోచనలతో చాలా కష్టపడి టైగర్ 3 సినిమాలో యాక్టింగ్ ఇరగదీశారు.
ఈక్రమంలోనే పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని నవంబర్ 12వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. అయితే సినిమా చాలా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీసు వద్ద మాత్రం ఊహించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ముఖ్యంగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ముఖ్యంగా ఫుల్ రన్‌లో రూ. 280 కోట్లు వరకు నెట్ వసూళ్లనే రాబట్టింది. దాదాపు 30 కోట్ల రూపాయల నష్టాలతో సల్లూ భాయ్ కు షాకిచ్చింది.

ముఖ్యంగా టైగర్, టైగర్ 2 చిత్రాలకు భారీ స్థాయిలో వసూళ్లు రాగా.. ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందని అంతా భావించారు. ఈక్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు అన్నీ తెగ పోటీ పడ్డాయి. కానీ చివరకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరలకు దక్కించుకుంది. విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ కూడా చేసుకున్నారు. కానీ సినిమా ఊహించని రీతిలో షాకిచ్చింది. దీంతో ఈ సినిమాను నెలన్నర రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకు రాబోతున్నారు.

అయితే ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ అనుకున్న తేదీలో మార్పులు జరిగాయి. 12వ తేదీకి బదులుగా డిసెంబర్ 31వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నారట. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీ నుంచి అందుబాటులో ఉండబోతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాను మీరు చూసి ఉండకపోతే ఓటీటీ వేధికగా ఈ సినిమాను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

ఇదంతా ఇలా ఉండగా.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా కనిపించారు. అలాగే ఇమ్రాన్ హస్మీ విలన్‌గా నటించి మెప్పించారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ అందించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో


Click it and Unblock the Notifications











