Shah Rukh Khan Jawan సినిమాలో మరో సర్‌ప్రైజ్‌... పవర్ ఫుల్ రోల్‌లో స్టార్ హీరో ఎంట్రీ

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాగా... సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటిస్తుండగా... మరో స్టార్ హీరో పవర్ రోల్ లో నటించారు. దీంతో ఆ హీరో ఎంట్రీ చూసిన ప్రేక్షకులు అరుపులు, విజిల్స్ తో థియేటర్లు హోరెత్తిపోయాయి. అసలు ఆ హీరో ఎవరు.. ఏంటో తెలుసుకుందాం.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయన తార నటించగా.. విలన్ గా తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. షారుఖ్ ఖాన్ కు విలన్ గా నటించారు. ఇక ఇందులో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అతిథి పాత్రలో కనిపించింది.

Bollywood star hero Sanjay Dutt acted in a powerful role in Shah Rukh Khan Jawan movie

ఇక జవాన్ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు సైతం ఓ పాత్రలో మెరిసింది. అంతే కాదు ప్రియమణి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని షారుఖ్‌ ఖాన్‌ హోంబ్యానర్ రెడీ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గౌరీఖాన్ 300కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించింది.

Bollywood star hero Sanjay Dutt acted in a powerful role in Shah Rukh Khan Jawan movie

జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే దీపికా పదుకునే గెస్టులో రోల్ చేయగా... మరో స్టార్ హీరో కూడా గెస్టు రోల్ లో కనిపించారు. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్త్. ఈయన ఎంట్రీతో థియేటర్లు మారుమోగాయి. విజిల్స్, అరుపులతో థియేటర్లు హోరెత్తాయి. సంజయ్ దత్త్ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారని తెలుస్తోంది.

Bollywood star hero Sanjay Dutt acted in a powerful role in Shah Rukh Khan Jawan movie

ఇక దర్శకుడు అట్లీ గత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ సినిమాలో సర్ప్రైజ్ అయితే ఉంటుంది. ఇప్పుడే చెప్పలేం.. స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు అర్థం సంజయ్ దత్ ఎంట్రీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ అయితే నటించిందని చెప్పువచ్చు. ఇక జవాన్ సినిమాలో అట్లీ కూడా క్యామియో ఎంట్రీ ఇవ్వడం విశేషం.

Bollywood star hero Sanjay Dutt acted in a powerful role in Shah Rukh Khan Jawan movie

జవాన్ సినిమాలో సంజయ్ దత్త్ క్యారెక్టర్ పేరు మాధవ్ నాయక్. ఈయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వగా.. ఈ సినిమాలో ఆయన భారత రాయభారిగా కనిపిస్తారు. షారుఖ్ ను జైలులో ఉంచితే.. అక్కడి గవర్నమెంట్ మాధవ్ నాయక్ ను పిలిపించి మాట్లాడుతుంది. ఈ పాత్రలో సంజయ్ దత్త్ నటన అద్భతమని అంటున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 125కోట్ల రూపాయలు సాధిస్తుందని ట్రెడ్ వర్గాల అంఛనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X