Baapu OTT: గుండెల్ని పిండేసే బాపు.. రెండు వారాలకే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ప్రతి వారం లాగానే ఈవారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. లవ్ , యాక్షన్, రొమాన్స్, హార్రర్, థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అన్ని ఓటీటీలు తమ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆయా సినిమాల స్ట్రీమింగ్ వివరాలను ఉంచాయి. తాజాగా జియో హాట్ స్టార్‌లో ఓ ఎమోషనల్ మూవీ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలంగాణ బ్యాక్ డ్రాప్, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పల్లె వాతావరణంలో కొద్దినెలల క్రితం విడుదలైన బలగం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడా స్టార్లు, భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు బొక్కబొర్లాపడుతున్న దశలో చిన్న సినిమా సత్తాను నిరూపించిన చిత్రం బలగం. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని బలంగా చాటి చెప్పింది బలగం. పల్లెలో జరిగిన ఒక చావు, పెద్ద కర్మ, కాకి ముట్టడం వంటి సంఘటనల చుట్టూ తిరిగే ఈ సినిమా దిల్‌రాజు బ్యానర్‌కు కాసుల వర్షం కురిపించింది.

బలగం తర్వాత.. పల్లె బ్యాక్ డ్రాప్‌లో రకరకాల సినిమాలు వచ్చాయి కానీ, అవేవి ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాయి. తాజాగా మరో బలగం అనిపించుకున్న సినిమాయే బాపు. సీనియర్ నటులు బ్రహ్మాజీ, ఆమని లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, మణి ఎగుర్ల, రచ్చరవి, గంగవ్వ, అభిత తదితరులు కీలకపాత్ర పోషించారు. సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దయ దర్శకత్వం వహించారు.
మరో బలగం అవుతుందని మీడియా, సోషల్ మీడియాలో బాపు సినిమా గురించి బాగా డిస్కషన్ నడిచింది. పల్లెలో అప్పుల పాలైన ఓ రైతు తన కుటుంబం కోసం ఆత్మహత్య చేసుకుంటే భీమా కింద వచ్చే డబ్బుతో తన ఫ్యామిలీ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తాడు. అయితే భార్య సలహా మేరకు కన్నతండ్రిని చంపేద్దామని అనుకుంటాడు. మరి ఆ రైతు తన తండ్రిని చంపాడా? బీమా సొమ్ము వచ్చిందా? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అన్నదే బాపు.

ఫీల్ గుడ్ మూవీగా, మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న బాపు చిత్రం తన థియేట్రికల్ రన్‌ను ముగించింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 57 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన థియేట్రిలక్ రన్ ముగించుకున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే బాపు ఓటీటీలోకి రానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్‌లో బాపు సినిమా మార్చి 7 నుంచి అందుబాటులో ఉంటుందని ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే థియేటర్‌లో సక్సెస్ కానీ ఎన్నో సినిమాలు ఓటీటీలలో దుమ్మురేపాయి. ఈ క్రమంలో బాపు కూడా అలాంటి సంచలనం నమోదు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం మరి బ్రహ్మాజీ చిత్రం ఎలాంటి మేజిక్ చేస్తుందో?


Click it and Unblock the Notifications











