అందరికీ షాక్ ఇచ్చిన బ్రహ్మాజీ కొడుకు కొత్త మూవీ.. OTT లోకి వచ్చేసింది.. ఎందులో చూడాలంటే?

బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు... ఓ పిట్ట కథ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ మూవీ బాక్స్ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని సంజయ్ రావు.. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంజయ్ హీరోగా.. ప్రణవి హీరోయిన్ గా నటించిన చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్. ఈ సినిమా థియేటర్లలో కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు తెలుసుకుందాం.

బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు.. ఓ పిట్ట కథ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ మూవీతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత సంజయ్ ఎందుకో గ్యాప్ అయితే ఇచ్చారు.

Brahmaji Son Sanjay Rao Slumdog Husband Movie Streaming Now on Amazon Prime Video Ott

చాలా గ్యాప్ తీసుకున్న సంజయ్... డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాతో జులై 29వ తేదీన థియేటర్లోకి వచ్చారు. ఇక ఈ మూవీలో సంజయ్ సరసన తెలుగు అమ్మాయి ప్రణవి మానుకొండ నటించింది. ఈ సినిమాకు ఏఆర్ శ్రీధర్ డైరెక్టర్ గా చేశారు. భీమ్స్ సీసీరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాను అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలుగా వ్యవహారించారు.

జులై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్లమ్ డాగ్ హస్బెండ్.. ఈ సినిమా బాగా అలరించింది. ఓ కుక్కను పెళ్లి చేసుకున్న హీరో... ఆ తర్వాత కుక్కతో శోభనం.. వంటి కాన్సెప్టుతో.. కామెడీ ఎంటర్ టైనర్ గా మూవీ ఆకట్టుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా పర్వాలేదనిపించింది. సూపర్ హిట్టు టాక్ తో దూసుకెళ్లిన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది.

Brahmaji Son Sanjay Rao Slumdog Husband Movie Streaming Now on Amazon Prime Video Ott

ఇక విడుదలై నెలరోజులు కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో లీడ్ రోల్స్ తోపాటు బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించిన ఈ మూవీ.... ఓటీటీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే... సోమరిగా తిరిగే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో ఓ అమ్మాయిని అతను ఇష్టపడుతాడు. ఇంట్లో వాళ్లను పెళ్లికి ఒప్పిస్తారు. కానీ ఆ యువకుడి జాతకం బాగా లేక మొదట ఏ చెట్టుకో లేక కుక్కకో పెళ్లి చేయాలని పంతులు చెబుతాడు. అలా కుక్కను పెళ్లి చేసుకున్న ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే ఈ సినిమా. మీరు థియేటర్లలో ఈ సినిమా మిస్ అయితే గనుక ఓటీటీలో ఓ సారి చూసేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X