Brahmanandam: ఎవ్వరూ ఊహించిన OTTలో బ్రహ్మానందం పంచతంత్రం.. ఎప్పుడు? ఎందులో అంటే?

ప్రస్తుతం ఓటీటీలో హవా కొనసాగుతోంది. థియేటర్ కు వెళ్లి అనుభూతి చెందే ప్రేక్షకులతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సినిమాలు వీక్షించే మూవీ లవర్స్ కూడా ఉన్నారు. వారికి అనుగుణంగానే ఓటీటీ సంస్థలు సినిమాలను అందిస్తున్నాయి. ఇక థియేటర్ లో విడుదలైన సినిమాల ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు మరికొంతమంది. అయితే ఇప్పటి వరకు ఓటీటీలో అంటే కొన్ని డిజిటల్ వేదికలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఎప్పుడూ చూడని సరికొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్ పై బ్రహ్మానందం ఇటీవల నటించిన పంచతంత్రం సినిమా విడుదల కాబోతుంది. మరి ఆ ఓటీటీ ఏంటీ? ఎప్పుడు విడుదల అవుతుందనే వివరాల్లోకి వెళితే..

హాస్య బ్రహ్మా బ్రహ్మానందం, కోలీవుడ్ నటుడు సముద్రఖని, ముద్దగుమ్మ స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), బ్యూటిఫుల్ శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య, శ్రీ విద్య ప్రధాన పాత్రలుగా నటించిన అంథాలజీ పంచతంత్రం. ది వీకెండ్ షో సమర్పణలో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై అఖిలేష్ వర్ధన్, స్రుజన్ ఎరబోలు ఈ పంచతంత్రం అంథాలజీని నిర్మించగా హర్ష పులిపాక దర్శకత్వం వహించారు.

Brahmanandam Swathi Reddy Panchathantram Movie OTT Release On ETV Win

ఐదు కథల నేపథ్యంగా వచ్చిన పంచతంత్రం సినిమాను గతేడాది డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమాలో కాన్సెప్ట్, నటీనటుల ప్రతిభ, టెక్నీషియిన్స్ టేకింగ్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మన శరీరంలోని పంచేద్రియాలను జ్ఞాపకాలతో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాలనే పాయింట్ తో ఈ అంథాలజీని చక్కగా తెరకెక్కించారను టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం థియేటర్లోకి తీసుకురాలేకపోయింది.

ఇప్పుడు థియేటర్లలో చూడలేని ప్రేక్షకులకు ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. అయితే సాధారణంగా ఓటీటీలు అంటే అమెజాన్ ప్రైమ్, తెలుగు ఓటీటీ ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, నెట్ ఫ్లిక్స్ ఇవే గుర్తుకు వస్తాయి. ఈ పంచతంత్రం సినిమా మాత్రం ఇందులో దొరకదు. ఈ అంథాలజీ సిరీస్ ను ఈటీవీ విన్ లో మాత్రమే అందుబాటులోకి రానుంది. తెలుగు నుంచి వచ్చిన ఇదొక కొత్త ప్లాట్ ఫామ్. అయితే దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కారణం ఇందులో కొత్త సినిమాలు విడుదల కాకపోవడమే.

అందుకే కాలానుగుణంగా మారి ఇప్పుడు పంచతంత్రం సినిమాను కొనుగోలు చేసి డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. మార్చి 22 నుంచి ఈటీవీ విన్ లో పంచతంత్రం సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ, భయం, చావు, నమ్మకం, లక్ష్యాలను సాధించడం అనే వేర్వేరు ఐదు కథల సముహారంగా పంచతంత్ర అంథాలజీని తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X