OTT movies: వీకెండ్ వచ్చేసింది.. ఓటీటీ లోకి సూపర్ హిట్ సినిమాలు... మూవీ లవర్స్ ఇక కాస్కోండి

వీకెండ్ వచ్చేసింది... మూవీ లవర్స్ గెట్ రెడీ.. రోజుకు మూడు సినిమాలు చూసిన ఈ వారం సినీ జాతర ఆగదు. బేబీ, బ్రో వంటి సూపర్ హిట్ మూవీస్ తో పాటు.. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.. వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇక ఈ వారం ముఖ్యంగా సినీ ప్రేక్షుకులు ఆ రెండు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. అవే బ్రో, బేబి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన మూవీ బ్రో. ఇక ఈ సినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్ర ఖని తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించింది.

Bro, Baby Movies to Some Other Interesting Movies Web Series Released On August 4th Week 2023

ఇప్పుడు బ్రో మూవీ ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీరు గనుక థియేటర్లలో మిస్ అయితే గనుక ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇక మరో మూవీ కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అదే ఆనంద్ దేవరకొండ బేబి మూవీ. ఇది చిన్న సినిమాగా రిలీజ్ అయి.. పెను సంచలనం సృష్టించింది. ఇక మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్ 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే... దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి.. రికార్డు సృష్టించింది.

Bro, Baby Movies to Some Other Interesting Movies Web Series Released On August 4th Week 2023

ఇక బేబీ మూవీలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో అలరించిన ఈ మూవీ... ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 25వ తేదీ నుంచి ఈ సినిమాను చూడొచ్చు. ఆహా గోల్డ్‌ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే ఈ సినిమాను చూసేయచ్చు.

ఇక బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌. థియేటర్లలో అలరించిన ఈ కామెడీ మూవీ... ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. సునీల్‌, ఆలీ, బ్రహ్మాజీ, సప్తగిరి, చంద్ర, యాదమరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా... ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ ఈరోజు నుంచి అవుతోంది.

ఇక ఈ వారం ఓటీటీలో అలరించే మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే...

Bro, Baby Movies to Some Other Interesting Movies Web Series Released On August 4th Week 2023

నెట్‌ఫ్లిక్స్‌:
1. రాగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24న విడుదల
2. కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (స్పానిష్‌) ఆగస్టు 25 న విడుదల
3. లిఫ్ట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25 న విడుదల

Bro, Baby Movies to Some Other Interesting Movies Web Series Released On August 4th Week 2023

డిస్నీ+హాట్‌స్టార్‌:

1. ఆఖ్రి సోచ్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 25

బుక్‌ మై షో:

1.సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 21న విడుదల
2.లయన్స్‌ గేట్‌ప్లే
3.ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25న విడుదల

జియో సినిమా:

1.లఖన్‌ లీలా భార్గవ (హిందీ) ఆగస్టు 21న విడుదల
2.బజావ్‌ (హిందీ) ఆగస్టు 25న విడుదల

యాపిల్‌ టీవీ ప్లస్‌:

1. ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)ఆగస్టు 23న విడుదల
2. వాంటెడ్‌: ది ఎస్కేప్‌ ఆఫ్‌ కార్లోస్‌ గోసన్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 25న విడుదల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X