సింగిల్ నైట్‌లో ఇన్ని ట్విస్ట్‌లా? .. ఓటీటీలోకి ప్రేమలు నటుడి హిట్ మూవీ, ఎందులో అంటే?
గతేడాది మలయాళంలో రిలీజైన ప్రేమలు చిత్రం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ భారీ వసూళ్లు సాధించింది. కేవలం 3 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు 146 కోట్ల రూపాయలను అందించింది. అంటే దాదాపు 45 శాతం లాభాలు. గతేడాది హిట్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న పుష్ప 2, కల్కి సినిమాలు కూడా ఈ స్థాయిలో లాభాలను అందించలేదు.
ప్రేమలు చిత్రంతో సంగీత్ ప్రతాప్ అనే యువ నటుడు యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం బ్రొమాన్స్. థియేటర్‌లలో ఆకట్టుకున్న బ్రొమాన్స్ తాజాగా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే.. బ్రొమాన్స్ సినిమాకు అర్జున్ డీ జోస్ దర్శకత్వం వహించారు. మ్యాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, కళాభవన్ షాజాన్, శ్యామ్ మోహన్, భరత్ బొప్పన్న, బిను పప్పులు కీలకపాత్రలు పోషించారు.

ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోవింద్ వసంత సంగీతం అందించగా.. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బ్రొమాన్స్ చిత్రానికి రూ.8 కోట్ల బడ్జెట్ అయ్యింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కనిపించకుండా పోయిన అన్నయ్యని తమ్ముడు ఎలా వెతికి పట్టుకున్నాడు? ఈ ప్రయాణంలో తమ్ముడికి ఎవరెవరు పరిచయం అయ్యారు? ఎవరు సాయం చేశారు? అన్నయ్య దొరికాడా లేదా? ఒక్క రాత్రిలోనే స్నేహం, ప్రేమ, ట్విస్టులను ఆ తమ్ముడు ఎలా ఫేస్ చేశాడన్నదే ఈ బ్రొమాన్స్ సినిమా కథ.
ఇక.. బ్రొమాన్స్ బాక్సాఫీస్ కలక్షన్స్‌ను పరిశీలిస్తే.. తొలి రోజు రూ.85 లక్షల ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా . రెండో రోజు రూ.1.20 కోట్లు, మూడో రోజు రూ.1.6 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను అందుకున్న ఈ సినిమా తొలి వారంలో రూ.5 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ రన్ ముగిసే నాటికి ఈ సినిమా భారత్‌లో రూ.8.56 కోట్ల నెట్, రూ.9.76 కోట్ల గ్రాస్ అందుకుంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.5.05 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా బ్రొమాన్స్ రూ.14.81 కోట్ల వసూళ్లను సాధించింది. బడ్జెట్ + ప్రీ రిలీజ్ బిజినెస్ కలిపి అతి కష్టం మీద బ్రొమాన్స్ ఒడ్డున పడిందని ట్రేడ్ పండితులు తెలిపారు.
థియేట్రికల్ రన్ ముగియడంతో థియేటర్‌లో రిలీజైన దాదాపు రెండున్నర నెలల తర్వాత బ్రొమాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బ్రొమాన్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో బ్రొమాన్స్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో యావరేజ్‌గా నిలిచిన ఈ సినిమా మరి ఓటీటీలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











