Kalki on OTT: 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే కల్కికి బంపరాఫర్?.. ఓటిటిలో అమెజాన్ ప్రైమ్ కొత్త ట్రెండ్!
ఇప్పుడు ఒక్క మన దేశ సినిమా దగ్గరే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినిమా దగ్గర కూడా ఓటిటి రంగం ఎంతగా రాణిస్తుందో చూస్తూనే ఉన్నాము. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినిమాల తాలూకా బిజినెస్ ని కూడా డిసైడ్ చేసే స్టేజి కి ఓటిటిలు ఆ=వచ్చేసాయి. ఇది మరీ ఎంతలా అయ్యింది అంటే ఒక సినిమా అనౌన్స్ అయ్యి ఒకవేళ ఆ సినిమా సరైన ఓటిటి ఆఫర్ అందుకోకపోతే ఆ సినిమాని నిర్మాతలు నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
అలా మన టాలీవుడ్ లో కూడా ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా కూడా అనౌన్స్ అయ్యి ఆగిపోయింది అని టాక్ ఉంది. మరి ఓటిటి ప్రభావం ఈ రేంజ్ లో ఉండగా తాజాగా ఓ క్రేజీ టాక్ ఇండియన్ సినిమా దగ్గర ఓటిటి ప్లాట్ ఫామ్స్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ అంటూ వినిపిస్తుంది. ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర థియేటర్స్ లో రిలీజ్ కాక ముందే ఆల్రెడీ ముందే ఓటిటి డీల్ పూర్తయినప్పటికీ ఒకవేళ సినిమా కానీ అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయితే మాత్రం ఆఫ్టర్ రిలీజ్ కూడా ఓటిటి వారు మరింత మొత్తంలో డబ్బులు ఆఫర్ చేస్తున్నారట.

అలా ఒకవేళ ఓ సినిమా హిట్ అయ్యి ఫలానా వసూళ్ల మార్క్ దాటితే ఒక అమౌంట్ పెంచుతున్నారు అంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ కొత్త ట్రెండ్ లో లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 1000 కోట్ల మార్క్ ని కానీ అందుకుంటే ఆల్రెడీ ఓటిటి డీల్ పూర్తి చేసుకున్న సంస్థలు మరింత మొత్తంలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.
దీనితో ఇప్పుడు కల్కి 2898 ఎడి 1000 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ చిత్రం 900 కోట్ల మార్క్ దగ్గరకి వెళ్తుండగా లాంగ్ రన్ లో 1000 కోట్లు అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కాగా ఆల్రెడీ కల్కి సినిమాకి ఒక్క ఓటిటి డీల్ నే 300 నుంచి 350 కోట్ల మధ్యలో జరిగింది అని ఒక టాక్ ఉంది.

ఈ మొత్తాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వారు ఇచ్చి ఆయా భాషలు హక్కులు సొంతం చేసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మరింత ఆఫర్ చేస్తున్నారట. మొత్తానికి మాత్రం కల్కి సినిమాకి మరో జాక్ పాట్ ఆన్ ది వే లో ఉందని అనుకోవచ్చు. కాగా ఈ భారీ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించాడు. ఆలాగే దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు కూడా అత్యంత కీలక పాత్రలు పోషించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











