మెడికల్ మాఫియాపై ఓ తండ్రి పోరాటం.. ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ , ఎందులో అంటే?
ప్రశాంత్ నీల్ - యష్ కుమార్‌ల కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది. కేజీఎఫ్ బాటలో కాంతారా, విక్రమ్ రోణ తదితర చిత్రాలు పాన్ ఇండియా మార్కెట్‌లో సత్తా చాటాయి. అప్పటి వరకు సరైన గుర్తింపు లేకుండా ఉండిపోయిన కన్నడ చిత్ర పరిశ్రమ , ఇక్కడ విడుదలయ్యే సినిమాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. దాంతో కన్నడ దర్శక నిర్మాతలు కూడా మంచి కంటెంట్‌తో ఉన్న సినిమాలు తీస్తున్నారు.
ఓటీటీల రాకతో కన్నడలోని ఒరిజినల్ కంటెంట్, వెబ్ సిరీస్‌లు, సినిమాలకు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓటీటీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కన్నడ మేకర్స్ మంచి కథలతో వస్తున్నారు. ఈ క్రమంలోనే క్రైమ్, సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్, కామెడీ జోనర్‌లో సినిమాలు తీస్తూ హిట్లు కొడుతోంది శాండల్‌వుడ్. ఈ క్రమంలోనే క్రైమ్ థ్రిల్లర్‌గా రిలీజై మంచి మార్కులు వేయించుకుంది సీ. మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. థియేటర్‌లో రిలీజైన దాదాపు 8 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

కిరణ్ సుబ్రమణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏజీఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఏజీ సుబ్రమణి నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ సుబ్రమణి, ప్రశాంత్ నటన, మధుమిత, చిత్ర, శ్రీధర్ రామ్, రూపేష్, శాన్వి, నిర్మల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ మురళీధరన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు నవీన్ సూర్య, వీరేష్ కుమార్‌లు సినిమాటోగ్రాఫర్‌లుగా వ్యవహరించారు. గతేడాది ఆగస్ట్ 23న సీ చిత్రం కన్నడంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కిరణ్ సుబ్రమణి ఓ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తుంటాడు. అయితే అనుకోని ప్రమాదం కారణంగా తన కూతురికి కంటి చూపు పోతుంది. కళ్లకు ఆపరేషన్ చేస్తే పోయిన చూపు తిరిగి వస్తుందని డాక్టర్లు చెప్పడంతో హీరో తన కూతురిని ఓ పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేస్తాడు. ఈ క్రమంలో అక్కడ మానవ అవయవాల అక్రమ రవాణా, అమ్మకాలు జరుగుతున్నట్లుగా తెలుసుకుంటాడు. ఈ మెడికల్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? ఆ మాఫియాతో హీరో ఎలా పోరాడాడు? తన కూతురికి కంటి చూపు వచ్చిందా? అనేది సీ సినిమా కథ.
టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచినప్పటికీ థియేటర్‌లో సీ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. అయితే థియేటర్‌లో ఆకట్టుకోని సినిమాలు ఇటీవల ఓటీటీలో దుమ్మురేపుతుండటంతో మేకర్స్ సీ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు. దాదాపు 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో అవాంతరాలు ఎదురవుతుండటంతో సినిమా ఆలస్యమైంది.
అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25 నుంచి సీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రీగా కాదు.. 99 రూపాయల రెంట్‌తో ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్‌లో ఫెయిలైన ఈ సినిమా.. ఓటీటీలో ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











