OTT ఓటీటీలో దుమ్ము రేపుతున్న చారి 111.. వెన్నెల కిషోర్ మూవీకి రికార్డు వ్యూస్!
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ నటించిన కామెడీ స్పై థ్రిల్లర్ చిత్రం చారీ 111. బర్కత్ స్టూడియో బ్యానర్‌పై యువ నిర్మాత అదితి సోని నిర్మించారు. సంయుక్త హీరోయిన్‌గా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, సత్య, బ్రహ్మజీ, పావనిరెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకలు ప్రశంసలు అందుకొని ఓటీటీలో దుమ్మురేపుతున్నది. ఈ సినిమా ఓటీటీలో చేస్తున్న హంగామాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అంతర్జాతీయ టెర్రరిస్టులు హైదరాబాద్‌లో విధ్వంసం చేయాలనే కుట్రను భగ్నం చేసే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో 111 ఏజెంట్‌గా వెన్నెల కిషోర్ పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా కడుపుబ్బ నవ్వించాడు. సంయుక్త యాక్షన్ హీరోయిన్‌గా మెప్పించారు. మురళీ శర్మ, రాహుల్ తదిరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లో థియేట్రికల్ రిలీజ్‌ను ఘనంగా ముగించుకొని ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం తాజాగా ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీగా వ్యూస్ సాధిస్తున్న ఈ చిత్రం అంచనాలు మించింది. ఇక ఈ సినిమాకు ఓటీటీలో వస్తున్న ఆదరణపై నిర్మాత అదితి సోని ఆనందాన్ని వ్యక్తం చేశారు. థియేట్రికల్‌గా మాకు మంచి సంతృప్తిని ఇచ్చింది. అయితే మేము ఊహించిన దాని కంటే ఎక్కువగా ఓటీటీలో రెస్సాన్స్ రావడం మాకు మరింత సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications











