OTT: నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ మూవీ... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
చైతన్య రావు... '30 వెడ్స్ 21' వెబ్ సిరీసుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ నటుడు అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలో ప్రేక్షుకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కరోనా సమయంలో '30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్ వచ్చి.. సూపర్ హిట్ గా నిలిచింది. చైతన్య రావు నటించిన ఈ సిరీస్ సూపర్ హిట్టుగా నిలవడంతో.. దీనికి కొనసాగింపు సిరీస్ కూడా వచ్చింది. ఇక చైతన్య రావు.. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటించాడు. ఆ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఈ చిత్రంలో చైతన్య రావుకు జోడీగా లావణ్య నటించింది.

అన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్రాన్ని ఓ పిట్ట కథ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన చెందు ముద్దు ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్.. ఇలా అన్ని అంశాలు కలబోసిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో జులై 21న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా పర్వాలేదనిపించింది.
సినిమా మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగడం, అలాగే ఈ చిత్రంలోని కామెడీ, మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ వీన్ లో ఆగస్టు 15 నుంచి ఈ రెట్రో కామెడీ క్రైమ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ అన్నపూర్ణ ఫొటో స్టూడియో విషయానికి వస్తే.. రెట్రో రొమాన్స్, మనసులను కదిలించే ప్రేమకథ, అలాగే ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్.. ఇలా అన్నీ కలగలిపిన చిత్రమిది. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని నిర్మించారు. గతంలో పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్ వంటి హిట్ సినిమాలు ఈ బ్యానర్‌లో వచ్చాయి.

అయితే ఈ అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ రిలీజ్ చేయడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ రెట్రో కామెడీ ఎంటర్‌టైనర్ లో మిహిర, ఉత్తర, వైవా రాఘవ, ఆదిత్య, యశ్ రంగినేని, వాసు ఇంటూరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రిన్స్ హెన్రీ స్వరాలు సమకూర్చాడు. మీరు గనుక ఈ మూవీని థియేటర్లలో మిస్ అయితే.. ఓటీటీలో ఓ సారి చూడొచ్చు.


Click it and Unblock the Notifications











