నేరుగా ఓటీటీలోకి మంచి ఫ్యామిలీ మూవీ.. గుండెలు పిండేసే దీన్ని ఎక్కడ చూడాలంటే!

సాధారణంగా ఈ మధ్య కాలంలో మాస్, క్రైమ్, హర్రర్, లవ్ అండ్ కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటికే ప్రేక్షకులు కూడా బాగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ తరహా కంటెంట్‌నే ఎక్కువగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడూ కొన్ని ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ మూవీస్ కూడా వస్తున్నాయి. అలా రాబోతున్నదే 'డియర్ నాన్న'.

'30 వెడ్స్‌ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించిన తాజా చిత్రమే 'డియర్ నాన్న'. ఓ మెడికల్ షాప్ నడుపుకునే వ్యక్తి.. తన కొడుకును కూడా ఫార్మసిస్ట్ చేయాలని అనుకుంటాడు. కానీ, హీరో మాత్రం చెఫ్ కావాలని కలలు కంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుర్రాడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ తండ్రి.. కొడుకు భవిష్యత్‌ గురించి ఎలా ఆలోచించాడు? అనే కంటెంట్‌తో ఇది తెరకెక్కింది.

Chaitanya Rao Starrer Dear Nanna Movie OTT Streaming From June 14th On AHA

పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'డియర్ నాన్న' సినిమాను అంజి సలాడి తెరకెక్కించాడు. ఈ చిత్రం ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా రావడంతో ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే మంచి అంచనాలను ఏర్పరచుకుంది. కానీ, ఈ సినిమా విడుదల గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

చైతన్య రావు - అంజి కలిసి చేసిన 'డియర్ నాన్న' మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినా రిలీజ్ డేట్ మాత్రం రివీల్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఇక, ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ మూవీ స్ట్రీమింగ్‌పై ఆహా అధికారిక ప్రకటనను వదిలింది.

Chaitanya Rao Starrer Dear Nanna Movie OTT Streaming From June 14th On AHA

గుండెలను పిండేసే ఫ్యామిలీ కథతో రూపొందిన 'డియర్ నాన్న' మూవీని జూన్ 14వ తేదీ నుంచే ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఫాదర్స్ డే సందర్భంగా మంచి ఎమోషనల్ మూవీని అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో నేరుగా ఓటీటీలో వస్తున్న ఈ చిత్రం కోసం అంతా వేచి చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. '30 వెడ్స్‌ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించిన 'డియర్ నాన్న' సినిమాలో సీనియర్ తెలుగు నటుడు సూర్య కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని బ్లాక్ పెప్పర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాకేష్ మహంకాళీ నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X