ఓటీటీలోకి వచ్చేసిన మర్డర్ మిస్టరీ.. ‘ప్రభాస్’ మూవీని ఎలా చూడాలంటే!

గతంలో సినిమాల పరంగా ప్రయోగాలు చేయడానికి ఫిల్మ్ మేకర్లు, నటీనటులు చాలా భయపడేవారు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దీంతో ఎన్నో కొత్త తరహా చిత్రాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్రైమ్ థ్రిల్లర్ మూవీలను ఎక్కువగా చేస్తున్నారు. ఇలా ఎన్నో చిత్రాలు వచ్చి అలరించాయి. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన చిత్రమే 'యేవమ్'.

తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సినిమానే 'యేవమ్'. ప్రకాష్ దంతులూరి అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం మర్డర్ మిస్టరీ స్టోరీతో తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీసి.. జూన్ 14వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Chandini Chowdary Starrer Yevam Movie Streaming Started On AHA

హీరో ప్రభాస్ పేరు వాడుకుంటూ మోసాలు చేసే కాన్సెప్టుతో వచ్చిన 'యేవమ్' సినిమా ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీకి మొదటి రోజు డీసెంట్ టాక్ లభించింది. కానీ, ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి డీసెంట్‌ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అలా ఫుల్ రన్‌లోనూ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'యేవమ్' సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు మంచి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Chandini Chowdary Starrer Yevam Movie Streaming Started On AHA

చాందినీ చౌదరి నటించిన 'యేవమ్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాను జూలై 24 నుంచే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు ఆహా సంస్థ తాజాగా వెల్లడించింది. అందుకు అనుగుణంగానే నేటి మధ్యాహ్నం నుంచి దీన్ని స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. ఇక, ఈ చిత్రానికి ఓటీటీలో మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా... సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో రూపొందిన 'యేవమ్' సినిమాను సి-స్పేస్ ప్రొడక్షన్స్, ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మించారు. ఇందులో వశిష్ట సింహా, భరత్ రాజ్, అషు రెడ్డి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కీర్తన శేషు, నీలేష్‌ మందలపు సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Read more about: chandini chowdary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X