OTT: చంద్రముఖి మీ ఇంటికి వచ్చేస్తుంది... ఎందులో చూడాలి అంటే?

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా పీ వాసు దర్శకత్వంలో 2005లో చంద్రముఖి సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాకు 2023లో చంద్రముఖి 2 గా సీక్వెల్ తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినా ఈ మూవీ... ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే....

2005లో రిలీజ్ అయిన చంద్రముఖి సినిమా జనాలను ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. అప్పటి వరకు ఉన్న హారర్ చిత్రాల కంటే... ఈ సినిమా మరింత భయపెట్టింది. ఇక ఈ చిత్రంలో రజినీ కాంత్ యాక్టింగ్... జ్యోతిక ఫెర్మామెన్స్, నయనతార అందం.. అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక మూవీకి పీ వాసు దర్శకత్వం.. ఆయన టేకింగ్ సినిమాను మరింత లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఇక చంద్రముఖి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

Raghava Laurence Kangana Chandramukhi 2

ఇక దాదాపు 18 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు. చంద్రముఖి 2 సినిమాకు కూడా పీ వాసు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ జంటగా తొలిసారి నటించారు. ఇక ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొనగా... సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ,మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది.

చంద్రముఖి 2 సినిమా రిలీజ్ అయిన మొదటి నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు విపరీతమైన బజ్ నెలకొంది. ఇక ఓటీటీ సంస్థలు ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక చంద్రముఖి 2 సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేశాయట. ఈ రెండు ఓటీటీల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

Chandramukhi 2 OTT

నెట్ ఫ్లిక్స్ 8 కోట్ల రూపాయలను పెట్టి చంద్రముఖి 2 సినిమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ కూడా భారీ ధరకు కొనుగోలు చేయగా... ఈ సినిమా విడుదలైన నెలన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయాలని ఒప్పందం చేసుకుందట. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో త్వరగా రిలీజ్ చేయాలని భావించారట. ఇక ఈ మూవీ నవంబర్ నాలుగోవారంలో కానీ... డిసెంబర్ మొదటి వారంలో రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుంది. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు.

Raghava Laurence Chandramukhi 2 OTT Release

ఇక చంద్రముఖి 2 విషయానికి వస్తే... కంగనా టైటిల్ రోల్ పోషించింది. ఇక ఈ సినిమాకు సంగీతం ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి అందించారు. హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా కోసం లారెన్స్ దాదాపు రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో వడివేలు, రావు రమేశ్, లక్ష్మీ మీనన్ మహిమ నంబియార్, రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X