Chhaava OTT: ఓటీటీలోకి ఛావా.. రష్మిక మూవీ ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
ప్రస్తుతం భారతీయ సినిమా దగ్గర సంచలనం రేపుతున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "ఛావా" అనే చెప్పాలి. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ మరో హిస్టారికల్ విజయాన్ని అందుకుంది. ది కేరళ స్టోరీ, ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు ఏ రకంగా లాంగ్ రన్ తో భారీ వసూళ్లు కొల్లగొట్టాయో..
మళ్ళీ ఛావా కూడా ఆ సినిమాల తరహా లోనే రికార్డు వసూళ్లు అందుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 700 కోట్ల మార్క్ దగ్గరకి వెళుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ నటిస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా భారత చరిత్ర మర్చిపోలేని మహా వీరులలో ఒకరైన ఛత్రపతి మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.

అయితే దీనిపై కూడా ప్రాపగాండా మరకలు పడ్డాయి కానీ యూనానిమస్ గా భారతీయులు ఈ చిత్రానికి పట్టం కట్టారు. హిందీలో రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ ని అందుకుంది. ఇలా తెలుగులో కూడా విడుదల అయ్యిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 10 కోట్ల మేర గ్రాస్ ని అందుకుంది.
మరి ఇంతలా సంచలనం రేపుతున్న ఈ భారీ హిట్ సినిమా ఓటిటి రిలీజ్ పట్ల కూడా మంచి ఆసక్తి తప్పకుండా ఉంటుంది. ఇలా ఛావా ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ న్యూస్ తెలుస్తుంది. దీని ప్రకారం ఛావా సినిమా వచ్చే నెల 11 నుంచి అంటే ఏప్రిల్ 11 నుంచి ఓటిటిలో అందుబాటులో ఉండనుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా ఓటిటి హక్కులని ప్రపంచ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
కాగా ఇందులో పాన్ ఇండియా భాషల్లోనే ఏప్రిల్ 11 నుంచి రానున్నట్టుగా ఇపుడు సమాచారం. సరిగా మరో నెల రోజులు వరకు ఛావా కోసం ఆడియెన్స్ కి ఎదురు చూపులు తప్పవని చెప్పక తప్పదు. కాగా హిందీలో మన దగ్గరలా కాకుండా చాలా సినిమాలు 8 వారాల ఒప్పందం ప్రాతిపదికన వస్తుంటాయి. ఛావాకి కూడా ఇదే డీల్ కావడంతో ఏప్రిల్ 11 గా డేట్ లాక్ అయినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
సో మరో నెల ఈ హిస్టారికల్ ఎపిక్ కోసం ఎదురు చూడక తప్పదు. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయే ఖన్నా అత్యంత క్రూరుడైన ఔరంగజేబు పాత్రలో నటించారు. అలాగే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించడం జరిగింది. అలాగే గతేడాది స్త్రీ 2, ముంజ్యా లాంటి సెన్సేషనల్ హిట్స్ అందించిన నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించి మళ్ళీ భారీ లాభాలు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











