OTT: ఓటీటీలోకి వచ్చిన ఛావా.. చిన్న స్ట్రీమింగ్ ట్విస్ట్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఆ మధ్య అంతా బాలీవుడ్ సినిమా దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. మెయిన్ గా కోవిడ్ పరిస్థితులు దగ్గర బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా మినిమమ్ టాక్ ని తెచ్చుకోలేదు. దీనితో సరైన హిట్స్ లేక పూర్వ వైభవం కోల్పోయిన బాలీవుడ్ మార్కెట్ లో ఫైనల్ గా కొన్ని సినిమాలు మాత్రం కొత్త ఊపు ఇచ్చాయి. మెయిన్ గా కొన్ని రా అండ్ రస్టిక్ సినిమాలకి హిందీ జనం పట్టం కట్టారు.
కాగా ఇలా వచ్చిన పలు రీ సౌండింగ్ హిట్స్ లో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ లేకపోయినప్పటికీ మన మట్టిలో ఉన్న ఎమోషన్ తో భాషకి సంబంధం లేకుండా వైరల్ గా మారిన చిత్రం 'ఛావా'. నటుడు విక్కీ కౌశల్ నుంచి ఉరి సినిమా తర్వాత మళ్ళీ యదార్ధ ఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించి ఏకంగా 800 కోట్ల గ్రాస్ దగ్గర వసూళ్లు అందుకుంది.

కాగా ఈ సినిమాలో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రెజెన్స్ ఉండడంతో సినిమా హిట్ క్రెడిట్ లో ఆమెకి కూడా చాలా మేర ఇచ్చారు. ఇలా బాలీవుడ్ లో ఒక హిస్టారికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డబ్బింగ్ సినిమాలు మినహాయిస్తే బాలీవుడ్ లో జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ గా మిస్ అయ్యింది. ఇక ఈ సినిమా అలా థియేటర్స్ లోకి వచ్చాక మా భాషలో రిలీజ్ చేయాలని మొదట డిమాండ్ చేసింది మన తెలుగు ఆడియెన్స్ మాత్రమే.
ఇలా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి దాదాపు రెండు నెలలు అయ్యిపోయింది. కానీ గత సినిమాల తరహాలో ఓటిటిలో మాత్రం ఈ చిత్రం అప్పుడే రాలేదు. కాగా ఆ మధ్య తెలుగు ఫిల్మీబీట్ నుంచి మేము ఈ ఏప్రిల్ 11 నుంచి సినిమా ఓటిటిలో అందుబాటులో ఉంటుంది అని రివీల్ చేసాము. కాగా ఇపుడు ఆ సమయం దగ్గరకి వచ్చిన నేపథ్యంలో వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అదే డేట్ ని అనౌన్స్ చేసి నిజం చేసింది.
దీనితో రేపు ఏప్రిల్ 11 నుంచి రోరింగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఛావా నెట్ ఫ్లిక్స్ లో రానుంది. కానీ ఇక్కడ ఆసక్తికర ట్విస్ట్ ఏంటంటే నెట్ ఫ్లిక్స్ వారు ఇది వరకు ఇచ్చిన సినిమాల తరహాలో పాన్ ఇండియా భాషల్లో ఇవ్వకపోవడం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. దీనితో రీజనల్ గా చూద్దాం అనుకున్నవారికి ఇది డిజప్పాయింట్ చేసింది.
ఒకవేళ ఇపుడు ఇవ్వకపోయినా నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో వస్తే హ్యాపీ కానీ రాకపోతే మాత్రం డిజప్పాయింట్మెంట్ తప్పదని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే బాలీవుడ్ రికార్డు గ్రాసర్స్ తో దూసుకెళ్తున్న నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











