twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chinni Movie Review : కీర్తి సురేష్ నట విశ్వరూపం.. ఓవరాల్ గా ఎలా ఉందంటే?

    |

    rating : 2.75/5
    టైటిల్ :చిన్ని
    ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
    నటీనటులు: కీర్తి సురేశ్‌, సెల్వరాఘవన్‌ తదితరులు
    సంగీతం: సామ్‌ సీఎస్‌
    ఎడిటింగ్‌: నాగూరన్‌ రామచంద్రన్‌
    సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి
    నిర్మాత: డి.ప్రభాకరన్‌, సిద్ధార్థ్‌ రావిపాటి
    రచన, దర్శకత్వం: అరుణ్‌ మాథేశ్వరన్‌


    మహానటి సినిమాతో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత పూర్తిస్థాయి గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేస్తూ వచ్చింది. ఆమె చేసిన కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే ఆమె కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ అవి ఏవి కూడా ఆమెతో కలిసి రాలేదు ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్ మొట్టమొదటిసారిగా ఒక డీ గ్లామర్ పాత్రలో నటించింది. తమిళంలో సాని కాయితం పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో చిన్ని పేరుతో మే ఆరో తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వరాఘవన్ ఒక కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉందా అనే విషయాలను ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

     'చిన్ని' కథ ఏమిటంటే?

    'చిన్ని' కథ ఏమిటంటే?


    ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామా. 1980ల కాలంలో చిత్రీకరించబడింది. తన భర్త మారప్ప తన కుమార్తె ధనతో ఉన్నంతలోనే కాలం వెళ్లదీస్తుంటుంది కానిస్టేబుల్ చిన్ని (కీర్తి సురేష్). అయితే తమ ఊరిలో ఉన్న రైస్ మిల్లులో పనిచేసే మారప్ప స్థానిక ఎన్నికల్లో తన స్నేహితుడిని నిలబెట్టి గెలిపించాలని అనుకుంటాడు. ఇదే విషయంలో మిల్లు యజమానికి మారెప్పకు గొడవ అయి కొట్టుకునే దాకా వెళుతుంది. తక్కువ కులానికి మారప్ప తనను అవమానించాడని ఎక్కువ కులానికి చెందిన మిల్లు ఓనర్ రగిలి పోతూ ఉంటాడు. ఎలా అయినా మారప్ప కుటుంబాన్ని నాశనం చేయాలని భావించిన మిల్ ఓనర్ ఏం చేశాడు? మిల్ ఓనర్ చర్యకు ప్రతి చర్యగా చిన్ని ఏం చేసింది? మధ్యలో రంగయ్య ఎవరు? రంగయ్యకి చిన్నికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే

     సినిమాలో ట్విస్టులు

    సినిమాలో ట్విస్టులు


    సినిమా ప్రారంభమైన వెంటనే ఒక ఒళ్ళు గగుర్పొడిచే సీన్ తో ప్రారంభమవుతుంది. అప్పుడే ఇది ఒక రివెంజ్ డ్రామా అనే విషయం కూడా అర్థమైపోతుంది. ఊరిలో అగ్రవర్ణాల వారి దాష్టీకానికి చిన్ని కుటుంబం బలి కావడంతో ఆ అగ్రవర్ణాలకు చెందిన వారిని చిన్ని ఏం చేసింది అనేది ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించాడు. సాధారణంగా మనం ఎప్పటినుంచో రివెంజ్ స్టోరీలను చూస్తూనే ఉన్నాం కానీ అసలు ఏ మాత్రం బలం లేని ఒక ఆడది బలం, బలగం, ఆర్థిక బలం ఉన్న వ్యక్తులను వెంటాడి వేటాడి ఎలా చంపింది అనే విషయాలు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. సినిమాను కొన్ని కాండాలుగా విభజించి ఒక్కొక్క కాండంలో ఏం చూపిస్తున్నాము అనేది క్లారిటీ ఇచ్చారు. తొలుత హత్యతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు ఆ తర్వాత చిన్ని కానిస్టేబుల్ గా ఎలా ఉండేది? భర్తతో, కుమార్తెతో జీవితం ఎలా ఉండేది అనే విషయాలను పరిచయం చేసి తరువాత కథలో ఒక్కొక్కరి నేపథ్యాన్ని కూడా చూపించాడు.

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే


    సినిమా మొదలైంది మొదలు చివరి వరకు ప్రేక్షకులలో అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేయడం కోసం అరుణ్‌ మాథేశ్వరన్‌ తీవ్రంగా కష్ట పడినట్లు కనిపిస్తుంది. సాధారణంగా తెలుగులో కానీ తమిళంలో కానీ ఎన్నో రివెంజ్ డ్రామా సినిమాలు వచ్చాయి. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం మీద దాదాపు అందరికీ క్లారిటీ ఉంటుంది. ఈ సినిమాలో ఆ విషయం మీద క్లారిటీ ఉన్నా సరే ఈ సారి ఎలా చంపుతారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు.. చిన్నికి జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే కాక చూస్తున్న వారి రక్తం మరిగే విధంగా అక్కడి విజువల్స్ ని తెర మీదకు తీసుకు రాగలిగాడు. సినిమా ప్రారంభం మొదలు చివరి వరకు చిన్ని, రంగయ్య కలిసి తమ శత్రువులను వేటాడే అంశం ఎక్కడికక్కడ ఆసక్తికరంగా చూపించాడు.

    నటీనటుల విషయానికి వస్తే

    నటీనటుల విషయానికి వస్తే


    మహానటి సినిమా తర్వాత ఆ స్థాయిలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కీర్తి సురేష్ కి మరొకటి దక్కలేదు. మధ్యలో చాలా గ్లామర్ పాత్రలు, హోమ్లీ హీరోయిన్ పాత్రలు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసింది కానీ ఎక్కడా కూడా స్థాయి పాత్ర ఆమెకు దక్కలేదు. అసలు ఇలాంటి పాత్ర ఒప్పుకోవడమే ఆమె అందుకున్న మొదటి విజయం అనుకోవచ్చు. అసలు ఏ మాత్రం మేకప్ లేకుండా పూర్తి స్థాయి డీగ్లామర్ పాత్రలో కీర్తి సురేష్ లీనమైపోయింది. ఆమె కాకుండా ఆమె పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టం అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా ద్వారా నటుడిగా మారిన సెల్వరాఘవన్ నటన గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. నటనలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా సినిమాలో ఆయన నటన కనిపించింది. తమిళ సినీ పరిశ్రమకు మరో అద్భుతమైన నటుడు దొరికాడు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సినిమాకు కీర్తి సురేష్, సెల్వరాఘవన్ ఇద్దరూ కూడా ఊపిరి పోశారు అని చెప్పక తప్పదు. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ వారెవరూ తెలుగువారికి తెలిసినవారు కాదు.

    టెక్నికల్ టీం విషయానికి వస్తే

    టెక్నికల్ టీం విషయానికి వస్తే


    సినిమా టెక్నికల్ పరంగా కూడా ఎక్కడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి బలమైన కథ ఉన్న సినిమాలో పాటలు లేకపోయినా ఎక్కడా ప్రేక్షకులకు పాటలు లేవు అనే భావన కూడా కలిగించకుండా ఈ సినిమాను రూపొందించారు. అయితే సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన బలం అని చెప్పక తప్పదు శ్యాం సిఎస్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ కూడా కొంచెం కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మధ్య మధ్యలో కలర్ టోన్స్ మారుస్తూ ఉండటం కూడా ఒక వినూత్న కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. ఇది కొత్త కథ అని చెప్పలేం కానీ కథ నడిపిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్న తీరు బాగుంది. అయి ఓటీటీ విడుదల కావడంతో రక్తపాతాన్ని ఎక్కడా కత్తిరించకుండా అలాగే వదిలేశారు.

    ఫైనల్ గా

    ఫైనల్ గా


    చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ లో ఉన్న పూర్తి స్థాయి నటనను ఈ సినిమా ద్వారా వెలికి తీసింది. ఈ కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ ఈ సినిమాను ఒకసారి చూసి ఆనందించవచ్చు. రొటీన్ రివెంజ్ డ్రామా అయినప్పటికీ కీర్తి సురేష్ సెల్వరాఘవన్ నటన కోసమైనా సినిమా చూడవచ్చు. కథలో పెద్దగా లాజిక్ ఉండదు. కాబట్టి స్లోగా ఉన్నా మంచి రివేంజ్‌ డ్రామా చూడాలనుకుంటే 'చిన్ని' మూవీని ఎంజాయ్ చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిన్ని ఒకరా అండ్ రస్టిక్ రివెంజ్ డ్రామా. చిన్న పిల్లలతో కలిసి ఈ సినిమా చూడకుండా ఉంటే మంచిది.

    English summary
    The chinni movie starring keerthy Suresh and Selva Raghavan has been released in Amazon Prime. We present to you the movie review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X