Chiranjeevi: ఆ ఊరిలో కోడిగుడ్లతో కొట్టారు.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్, అలా అవమానాలతోనే!

స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ టాలీవుడ్ లో బాస్ గా మారారు. దాదాపు 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే అప్పట్లో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన చిరంజీవికి అంతగా కలిసి రాలేదు. ప్రజా రాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవికు ఓట్ల ద్వారా పెద్దగా ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే అప్పట్లో ప్రజా రాజ్యం పార్టీపై అనేక రూమర్స్, విమర్శలు సైతం వచ్చాయి. పార్టీ తరఫున చేసిన ప్రచారంలో ఆయనను కోడి గుడ్లతో కొట్టినట్లు తాజాగా చెప్పుకొచ్చారు చిరంజీవి.

త్వరలో రెండో సీజన్ పూర్తి..

త్వరలో రెండో సీజన్ పూర్తి..

తెలుగు తెరపై సుమారు 15 ఏళ్ల క్రితమే టాక్ షోలు ప్రారంభం అయ్యాయి. ఇటీవల ఓటీటీ వేదికల హవా విపరీతంగా పెరిగిపోవడంతో.. ఈ టాక్ షోలకు మరింత క్రేజ్ వస్తోంది. ఇప్పటికే తెలుగులో లక్ష్మీ టాక్ షో, అలీతో సరదాగా, నంబర్ వన్ యారి, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, సామ్ విత్ జామ్ వంటి టాక్ షోలు అలరించాయి. ఇక తాజాగా రెండో సీజన్ ను కూడా పూర్తి చేసుకోనున్న నందమూరి నటసింహం బాలయ్య బాబు అన్ స్టాపబుల్ కు ఊహించని క్రేజ్ వచ్చింది.

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు..

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు..

నందమూరి నటసింహం మొదటి సారిగా హోస్ట్ చేసిన ఈ అన్ స్టాపబుల్ షో నిర్విర్యామంగా కొనసాగి.. రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా సాగాయి. ఇక ఇప్పుడు ఈ సీజన్ కూడా పూర్తి కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేసిన ఎపిసోడ్ రెండో పార్టును మొదటగా ఫిబ్రవరి 10న టెలీకాస్ట్ చేయనున్నారు. కానీ పలు కారణాల వల్ల ఫిబ్రవరి 9నే స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ అన్ స్టాపబుల్ రెండో సీజన్ ముగిసిన తర్వాతి రోజే మరొ కొత్త టాక్ షో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అదే "నిజం విత్ స్మిత". దీన్ని పాపులర్ సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్నారు.

ఫిబ్రవరి 10 నుంచే..

ఫిబ్రవరి 10 నుంచే..

ఇండియన్ పాప్ సింగర్, నటిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్మిత హోస్ట్ గా మారిన ఆ టాక్ షోనే "నిజం విత్ స్మిత". ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల "నిజం విత్ స్మిత" షోకి సంబంధించిన ప్రోమోలో అతిథులను, వారిని అడిగిన బోల్డ్ ప్రశ్నలు, అంతేవిధంగా వారు చెప్పిన ఆసక్తికర సమాధానాలు అన్నింటిని చూపించారు. ఈ టాక్ షోలో అనేకమైన అంశాలను లేవనెత్తారు.

హీరోలు, డైరెక్టర్స్ హాజరు..

హీరోలు, డైరెక్టర్స్ హాజరు..

స్మిత "నిజం విత్ స్మిత" టాక్ షోకి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు రాధికా శరత్ కుమార్, సినిమా హీరోలు నాని, రానా దగ్గుబాటి, అడవి శేష్, అల్లరి నరేష్, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత స్వప్న ద్, డైరెక్టర్స్ దేవకట్ట, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్స్ అన్నింటికి సంబంధించి ఇటీవల వదిలిన ప్రోమోలో నెపోటిజం, కులం, చంద్రబాబు వెన్నుపోటు వంటి డెలికేట్ అంశాలను చర్చించారు.

మీ ఫస్ట్ క్రష్ ఎవరు..

మీ ఫస్ట్ క్రష్ ఎవరు..

అయితే "నిజం విత్ స్మిత" టాక్ షోకి ఫస్ట్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోలో చిరంజీవికి స్వాగతం పలికారు స్మిత. "కాలేజ్ డేస్ లో మీ ఫస్ట్ క్రష్" అని స్మిత అడిగితే చిరు షాక్ అయి అలానే చూస్తుండిపోయారు. "స్టార్ డమ్ అనేది కొంతమందికే.. ఆ స్టేజీకి వెళ్లాలంటే అవమానాలు.. అనుమానాలు" అని స్మిత అంటే.. "జగిత్యాలలో అక్కడ నాకు పైనుంచి పూల వర్షంలా కురిసింది.. కొంచెం ముందుకు వెళ్లగానే కోడి గుడ్లు విసిరి కొట్టారు" అని షాకింగ్ గా తెలిపారు చిరంజీవి.

కోడిగుడ్లు తలకు రాసుకుంటే..

"మళ్లీ ఒక వర ప్రసాద్ నుంచి మెగాస్టార్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా" అని స్మిత అడిగారు. దీంతో చిరంజీవి ఆలోచనలో పడిపోయారు. ఇలా నిజం నిర్భయంగా అంటూ ప్రోమో ముగిసింది. అయితే చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా జగిత్యాలకు వెళ్లిన సమయంలో కోడి గుడ్లతో కొట్టినట్లు తెలుస్తోంది. అప్పుడు కోడిగుడ్లు తలకు రాసుకుంటే మంచిదని చిన్నప్పుడు చెప్పారని.. అవి వేసి వాళ్ల కుసుంస్కారాన్ని నిలుపుకుంటున్నారని చిరు గతంలో తెలిపారు. అలాగే కొంతమంది మంచివాళ్లు ప్రజలకు నచ్చరని కామెంట్స్ చేశారు. చిరంజీవి రాజకీయాలకు దూరం కావడానికి ఇలాంటి పలు అవమానాలే కారణమని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X