Bhola Shankar OTT: భోళా శంకర్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
చిరంజీవి కెరియర్ లో అత్యంత దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో భోళా శంకర్ సినిమా కూడా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిరోజుల క్రితం అంటే ఆగస్టు 11వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా మునుపెన్నడూ ఊహించని విధంగా దారుణమైన డిజాస్టర్ ట్రాక్ తెచ్చుకోవడమే కాదు. కలెక్షన్స్ కూడా దారుణంగా వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.
నిజానికి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించక ముందే భోళా శంకర్ సినిమాకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు తామే కొనుక్కున్నామని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పుడు తాజాగా నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ఈ సినిమాని స్ట్రీమ్ చేయబోతుంది అనే విషయం మీద ఒక వార్త బయటకు వచ్చింది. అయితే అఫీషియల్ సమాచారం కాదు. కానీ దాదాపుగా ఈ వార్త అయితే టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

నిజానికి నిర్మాతల మండలి లెక్కల ప్రకారం పెద్ద సినిమా అయితే రిలీజ్ అయిన 28 రోజుల తర్వాత అంటే నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దాదాపుగా సెప్టెంబర్ 18వ తేదీన సినిమాని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.
నిజానికి ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో తన సోదరుడు రాంబ్రహ్మం సుంకరతో కలిసి నిర్మించారు. తన పార్టీ వరకు మెగాస్టార్ చిరంజీవి డాన్సులు యాక్షన్ కామెడీతో దుమ్మురేపిన ఎందుకో డైరెక్షన్ వర్కౌట్ కాకపోవడంతో సినిమాకి డిజాస్టర్ టాక్ మొదటి ఆట నుంచి వచ్చేసింది. వాస్తవానికి ఈ సినిమాని తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే అజిత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాకి రీమేక్ చేశారు.
ఈ సినిమాతో షాడో సినిమా తర్వాత సైలెంట్ అయిపోయిన మెహర్ రమేష్ మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అంటే మంచి హోంవర్క్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాడని అందరూ అనుకుంటే ఆయన మాత్రం పేలవమైన సబ్జెక్టుతో వచ్చి బొక్క బోర్లా పడ్డారు. ఈ దెబ్బకి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండకుండా ఆయన సైలెంట్ అయిపోయారు.

అయితే ఈ మధ్యకాలంలో థియేటర్లలో సరిగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి సినిమా సెప్టెంబర్ 18వ తేదీన నెట్ ఫిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక్కసారి అయినా సినిమా చూసి ఎందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో థియేటర్లలో బొక్క బోర్లా పడిన సినిమాలు సైతం ఓటీటీలో మంచి వ్యూయర్షిప్ సాధిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











