మెగాస్టార్ చిరంజీవితో నందమూరి బాలకృష్ణ.. రికార్డులు షేక్ అయ్యేలా బడా నిర్మాత ప్లాన్
వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో యమా ఫామ్‌లో ఉన్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK Show) అనే షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఇది.. త్వరలోనే మూడో దానితో రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే..
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో
నందమూరి బాలకృష్ణ 'అఖండ' అనే సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ ఉత్సాహంతోనే వరుసగా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' అనే సినిమాలతోనూ వచ్చారు. ఇవి కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో బాలయ్య హ్యాట్రిక్ హీరోగా నిలిచారు. ఇక, ఇప్పుడు బాబీతో నటసింహం ఓ క్రేజీ సినిమాను చేస్తున్నారు.

హోస్టుగా బాలయ్య ఎంట్రీ
ప్రయోగాలు చేయడంలో వెనుకాడని నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే టాక్ షోతో ఓటీటీలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది సక్సెస్ అయింది.
యాంకర్‌గా ఫిదా చేశారుగా
చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోకు మాత్రం ఆయన సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరించారు. దీంతో మొదటి సీజన్‌లోని ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా హోస్టుగా బాలయ్య తనదైన రీతిలో ఫిదా చేసేశారు.

3వ సీజన్‌కు రంగం సిద్ధం
సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆహా టీమ్ రెండో సీజన్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో సీజన్‌ను చేసేందుకు ఆహా సంస్థ సిద్ధం అవుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.
చిరంజీవితోనే బాలకృష్ణ
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోకు సంబంధించిన మూడో సీజన్ కోసం ఇప్పటికే కాన్సెప్టును ఆహా సంస్థ రెడీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేయబోతున్నారట. ఇక, ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవిని గెస్టుగా తీసుకు రాబోతున్నారని తాజా సమాచారం. ఈ కాంబోను నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేశారని టాక్.

సీఎంతో పాటు వాళ్లంతా
మొదటి రెండు సీజన్లను సూపర్ డూపర్ హిట్ అవడంతో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' మూడో సీజన్‌ను మరింత ఉత్సాహంతో ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఇందులోకి తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీఎంతో పాటు కొందరు స్టార్ హీరోలను కూడా తీసుకు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌పై అంచనాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











