Godfather OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన ‘గాడ్ ఫాదర్’.. చిరంజీవి మాస్ కుమ్ముడు
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ మరింత జోష్‌తో ఉన్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను మైమరపించిన ఆయన.. హిట్లు ఫ్లాపులను బేరీజు వేసుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే సినిమాను చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది.
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అలా దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఆ తర్వాత వసూళ్లు తగ్గిపోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే రన్‌ను ముగించింది. దీంతో ఈ సినిమా దాదాపు 90 శాతానికి పైగా వసూళ్లను రాబట్టి సెమీ హిట్‌తో సరిపెట్టుకుంది. అయినప్పటికీ చిత్ర యూనిట్ సంతృప్తిగానే ఉంది.

థియేటర్లలో దాదాపు నెల రోజుల పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. దీన్ని నేటి (నవంబర్ 19వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో థియేటర్లలో మాదిరిగానే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నట్లు తెలిసింది.
చిరంజీవి హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తీసిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. ఈ క్రేజీ మూవీలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











