For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  GodFather రికార్డు ధరకు చిరంజీవి మూవీ డిజిటల్ రైట్స్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

  |

  మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లకు భారీ రెస్సాన్స్ రావడంతో ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ భారీ రేంజ్‌లో జరుగుతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో నటించడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. దాంతో పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ బ్రహ్మండంగా జరిగింది. గాడ్‌ఫాదర్ సినిమాకు జరిగిన డిజిటల్ (ఓటీటీ) టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్‌లో జరిగిందంటే?

   ప్రతిష్టాత్మకంగా గాడ్‌ఫాదర్

  ప్రతిష్టాత్మకంగా గాడ్‌ఫాదర్


  చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రాల్లో గాడ్‌ఫాదర్ ఒకటి. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. మలయాళ మాతృకలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రను సల్మాన్ ఖాన్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమా కోసం అటు ఉత్తరాది ప్రేక్షకులు, దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

   ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్

  ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్


  ఇక గాడ్‌ఫాదర్ చిత్రంలో నయనతార, పూరీ జగన్నాథ్, సముద్రఖని, సునీల్ లాంటి తారలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా చర్చ జరిగింది. దాంతో థియేట్రికల్, శాటిలైట్ బిజినెస్‌తోపాటు ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమా డిజిటిల్ రైట్స్ హాట్ కేకులా అమ్ముడుపోవడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది.

  పోటీ పడిన ఓటీటీ సంస్థలు

  పోటీ పడిన ఓటీటీ సంస్థలు


  గాడ్‌ఫాదర్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ ఉండటంతో హక్కులను కోసం టాప్ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు ఈ సినిమా హక్కులను నెటిఫ్లిక్స్ సంస్థ దక్కించుకొన్నది. తెలుగు, హిందీ భాషలకు సంబంధించిన హక్కుల కోసం 57 కోట్లు నెట్‌ఫ్లిక్స్‌ చెల్లించినట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటన చేసింది.

  ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

  ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?


  అయితే దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన గాడ్‌ఫాదర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అయితే తెలుగు సినిమా పరిశ్రమల నిర్మాతలు ఇటీవల విధించుకొన్న నిబంధనల ప్రకారం ఈ సినిమా రిలీజ్ తర్వాత కనీసం 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రేక్షకులు థియేటర్‌లో కొత్త అనుభూతిని పొందాల్సి ఉంటుంది.

  గాడ్‌ఫాదర్ తెర వెనుక, తెర ముందు

  గాడ్‌ఫాదర్ తెర వెనుక, తెర ముందు


  నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాథ్, సత్యదేవ్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మజీ, సముద్రఖని, తాన్య రవిచంద్రన్, గంగవ్వ తదితరులు
  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
  డైలాగ్స్: లక్ష్మీ భూపాల్
  నిర్మాతలు: రాంచరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్
  సినిమాటోగ్రఫి: నిరవ్ షా
  ఎడిటింగ్: మార్తండ్ కే వెంకటేష్
  మ్యూజిక్: ఎస్ థమన్
  బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్
  రిలీజ్ డేట్: 2022-10-05

  English summary
  Megastar Chiranjeevi is playing the titular role in GodFather, whereas Bollywood megastar Salman Khan will be seen in a mighty role in the action extravaganza set for release on October 5th. Netflix has spent 57 crores for the digital rights of the movie. This deal includes Telugu and Hindi OTT rights of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X