MSVPG OTT: ఓటీటీలో మెగా విధ్వంసం.. 24 గంటల్లోనే మన శంకర ప్రసాద్ నయా రికార్డు

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం ఏలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూళ్లు చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఓటీటీ వేదికపైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కేవలం 24 గంటల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే?

ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. తొలి వారంలోనే రూ. 292 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ. 300 కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా, 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసింది.

Chiranjeevi s Mana Shankara Vara Prasad Garu Sets 200M Streaming Record on ZEE5

దేశీయంగా మాత్రమే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా ఇది చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో ఆయన గత బ్లాక్‌బస్టర్ సైరా నరసింహ రెడ్డి రికార్డులను అధిగమించింది. అలాగే ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్ర వసూళ్లను మించి తెలుగు మార్కెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓటీటీలో డిజిటల్ రికార్డ్

థియేటర్లలో విజయాన్ని సాధించిన మన శంకర్ వరప్రసాద్ గారు ఫిబ్రవరి 11, 2026న ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5 లో విడుదలైంది. విడుదలైన 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు చేసి ఆ ప్లాట్‌ఫామ్‌లో కొత్త రికార్డును సృష్టించింది. థియేట్రికల్ రన్ తర్వాత కూడా ప్రేక్షకుల్లో తగ్గని ఆసక్తి, మెగా స్టార్‌పై ఉన్న అభిమానమే ఈ డిజిటల్ సక్సెస్‌కు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, వెంకటేష్, సచిన్ ఖేడేకర్, క్యాథరిన్ ట్రెసా, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ ప్రీమియర్లతో విడుదలైన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చింది. సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. నిర్మాణ బాధ్యతలను సైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైనేర్స్ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి.

మెగాస్టార్ ఆధిపత్యం
ఈ విజయంతో 2026 సంవత్సరంలో మెగా స్టార్ బాక్సాఫీస్ ఆధిపత్యం మరింత బలపడింది. భారీ ఓపెనింగ్స్, స్థిరమైన కలెక్షన్లు, ఓటీటీ రికార్డులతో "మన శంకర వర ప్రసాద్ గారు" సినిమా వాణిజ్య పరంగా మాత్రమే కాకుండా స్టార్ పవర్ పరంగా కూడా ఒక మైలురాయిగా నిలిచింది. సంక్రాంతి విన్నర్‌గా ప్రారంభమైన ఈ సినిమా, ఇప్పుడు థియేటర్లలోనూ, డిజిటల్ ప్రపంచంలోనూ తన జైత్రయాత్ర కొనసాగిస్తూ 2026లో తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త చరిత్రను రాసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X