For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather OTT: అప్పుడే ఓటీటీలోకి చిరంజీవి గాడ్ ఫాదర్.. ఎందులో తెలుసా?

    |

    సుమారు 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో గాడ్ ఫాదర్ ఒకటి. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమెక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే అంచనాల మధ్య చాలా గ్రాండ్ గాఅక్టోబర్ 5న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర విషయం హాట్ టాపిక్ గా మారింది.

    గ్రేస్ తో ప్రత్యేకమైన ఇమేజ్..

    గ్రేస్ తో ప్రత్యేకమైన ఇమేజ్..

    ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఆయన.. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నారు.

    21 ఏళ్ల క్రితం ఆ సినిమాకు..

    21 ఏళ్ల క్రితం ఆ సినిమాకు..

    మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి 'గాడ్ ఫాదర్' మూవీ. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 21 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాను ఈ సినిమాకు డైరెక్టర్‌గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

    తారాస్థాయిలో అంచనాలు..

    తారాస్థాయిలో అంచనాలు..

    కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన 'గాడ్ ఫాదర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లను భాగం చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవికి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అలాగే, హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.

     గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..

    గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..

    దీంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌, తాజాగా వచ్చిన ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రావడంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. అలాగే ఇటీవల ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అలాగే హిందీలో కూడా చాలా గ్రాండ్ గా సినిమా హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు.

    మంచి సక్సెస్ టాక్ తో..

    మంచి సక్సెస్ టాక్ తో..

    ఇక అత్యంత భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్ 5న చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి 153వ సినిమాగా వచ్చి గాడ్ ఫాదర్ మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. బాస్ కమ్ బ్యాక్ మూవీ అంటూ ఫ్యాన్స్ తెగ సంబరిపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందా అనే విషయాలు ఆసక్తిగా మారాయి.

    ప్రముఖ ఓటీటీ దిగ్గజంలో స్ట్రీమింగ్..

    ప్రముఖ ఓటీటీ దిగ్గజంలో స్ట్రీమింగ్..

    ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ. 57 కోట్లకు తెలుగు, తమిళం, హిందీ భాషల హక్కులను నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా చిరంజీవి తర్వాతి సినిమా హక్కులను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీ సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే.

    English summary
    Megastar Chiranjeevi Starrer Godfather Movie OTT Rights Whooped By Netflix At Rs 57 Cr And Will Streaming After 8 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X