Bhola Shankar OTT: ఆ ఓటీటీలోనే చిరంజీవి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలిస్తే!
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో అందరి కంటే ముందున్నారు టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య కాలంలోనే చాలా సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'భోళా శంకర్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీని మెహర్ రమేష్ తెరకెక్కించాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మంచిగానే దక్కుతోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో దీనికి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ ఉంది.

సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ డీల్‌పై ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని 'భోళా శంకర్' టైటిల్ కార్డ్స్‌లో కన్ఫార్మ్ చేశారు.
క్రేజీ కాంబోలో రూపొందిన 'భోళా శంకర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా తాజాగా న్యూస్ లీకైంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అంటే ఆగస్టు 11న విడుదలైన 'భోళా శంకర్' సెప్టెంబర్ 2వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్' మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











