Bhola Shankar OTT: ఓటీటీ డేట్ ఫిక్స్.. ఏకంగా అన్ని భాషల్లో.. అవి కూడా కలిపారు బాసూ!

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ సినీ ప్రియులను, తన అభిమానులు ఫుల్ ఖుషీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో వచ్చిన ఆయన.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రమే 'భోళా శంకర్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా తక్కువగానే దక్కింది. ఫలితంగా ఈ చిత్రం భారీ నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది.

 Chiranjeevi Starrer Bhola Shankar Movie Streaming on Netflix From September 15th

'భోళా శంకర్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ డీల్‌పై ఊహాగానాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఈ మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. అంతేకాదు, దీన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.

 Chiranjeevi Starrer Bhola Shankar Movie Streaming on Netflix From September 15th

త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతున్న 'భోళా శంకర్' మూవీని సెన్సార్ లేకుండానే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కూడా ఓ న్యూస్ లీకైంది. థియేటర్లలో కొన్ని డైలాగులతో పాటు విలన్ తలను నరికే సీన్‌ను కట్ చేశారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే వెర్షన్‌లో మాత్రం అవన్నీ ఉంటాయని తెలిసింది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్‌పై మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

 Chiranjeevi Starrer Bhola Shankar Movie Streaming on Netflix From September 15th

ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్' మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X