Bhola Shankar OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన భోళా శంకర్.. థియేటర్లలో మిస్ అయినవి కూడా!
ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలు సినిమాలు చేయాలంటే ఒక్కో దానికి కనీసం ఏడాది సమయం అయినా తీసుకుంటున్నారు. కానీ, కొందరు సీనియర్ హీరోలు మాత్రం వేగంగా మూవీలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మెగాస్టార్ చిరంజీవిదే. రీఎంట్రీలో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులు ఆయన యమ అలరిస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో సినిమాలతో వచ్చి మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'భోళా శంకర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఆగస్టు 11 విడుదలైంది. దీనికి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి స్పందన కరువు అవడంతో భారీ నష్టాలతో రన్‌ను ముగించాల్సి వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భోళా శంకర్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే చాలా ఓటీటీ సంస్థలు దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇంత తీవ్ర డిమాండ్ నడుమ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది.
మెహర్ రమేష్ దర్శత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే నేటి అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది.

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'భోళా శంకర్' మూవీని సెన్సార్ లేకుండానే తీసుకు వచ్చినట్లు తెలిసింది. అంటే.. థియేటర్లలో బీప్ వేసి చూపించిన కొన్ని డైలాగులతో పాటు కట్ చేసిన విలన్ తలను నరికే సీన్‌ను కూడా ఇందులో యాడ్ చేశారట. ఇక, చిరంజీవి సినిమాకు ఓటీటీలో మాత్రం మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక.. 'భోళా శంకర్' మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











