Bhola Shankar: ఇక్కడ డిజాస్టర్.. అక్కడ రికార్డు.. ఇండియాలోనే టాప్ మూవీగా భోళా శంకర్
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అలా సుమారు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్న చిరంజీవి.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ముందుకు వెళ్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 'భోళా శంకర్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్‌లో రాలేదు. ఆ తర్వాత కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ఫలితంగా చిరంజీవి నటించిన ఈ చిత్రం దాదాపు రూ. 50 కోట్లు నష్టాలతో రన్‌ను ముగించింది.

'భోళా శంకర్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ వచ్చింది. అందుకు అనుగుణంగానే చాలా ఓటీటీ సంస్థలు దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుని సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన 'భోళా శంకర్' చిత్రానికి నెట్‌ఫ్లెక్స్‌లో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రానికి అత్యధిక వ్యూస్ లభిస్తోన్నాయి. ఫలితంగా ఈ మూవీ ఏకంగా రెండు రోజుల నుంచి భారీ వ్యూవర్‌షిప్‌తో ఇండియాలోనే టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య చాలా సినిమాలు వచ్చినా ఈ మూవీ ప్రభావాన్ని చూపిస్తూ దూసుకెళ్తోంది.
'భోళా శంకర్' మూవీకి సంబంధించిన హిందీ వెర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇది టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. ఇలా ఇటు తెలుగులో నెంబర్ వన్‌గా, అటు హిందీలో పది ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా హవాను చూపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్' మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











