Balaiah Chiru Fan War: సోషల్ మీడియాలో బాలకృష్ణ, చిరంజీవి ఫ్యాన్ వార్.. ఆయ్ సీన్ పెట్టిన వివాదం!
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిగ్ ఫ్యామిలీస్ లో నందమూరి కుటుంబ వంశం కూడా ఒకటి. కాగా నందమూరి కుటుంబం నుంచి ఇటీవల ఓ కొత్త హీరో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే నితిన్ నార్నే నటించిన ఆయ్ సినిమాలోని కులాల కొట్లాట ఎపిసోడ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. చిరంజీవి, బాలయ్య రెఫరెన్స్ సీన్లు ఇరు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వాగ్వాదానికి దారి తీశాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ కి స్వయానా తన బావమరిది సినిమాలో ఒక షాకింగ్ సీన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జెనరల్ ఓ కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో వారి కుటుంబం సీనియర్ హీరోస్ రిఫరెన్స్ లు పెట్టుకొని తమ కెరీర్ కి బూస్టప్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఆయ్ సినిమాలో బాలకృష్ణ, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉన్నాయనే విధంగా కథను రాశారు.

అలానే ఎన్టీఆర్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య రిఫరెన్స్ లు వాడుకొని పైకి వచ్చినవాడే.. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం నుంచే వచ్చిన యువ హీరో నార్నె నితిన్ "ఆయ్" సినిమాలో బాలయ్యపై ఘోరమైన అవమానం జరిగే సీన్ ఉన్నప్పటికీ వారి నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదా అనేది షాకింగ్‌గా మారింది. "ఆయ్" సినిమా రీసెంట్ గానే ఓటిటిలో వచ్చింది.
ఇందులో విలన్ బాలయ్య అభిమాని ఓ థియేటర్ దగ్గర అతనికి ఎదురు తిరిగిన వాళ్ళు అందరినీ చితక్కొడితే అలాంటి వాడిని చితక్కొట్టే పాత్రదారుడిని మెగాస్టార్ అభిమానిగా సినిమాలో చూపించారు. బాలయ్య, చిరు ఇద్దరి హోర్డింగ్స్ కూడా కనిపిస్తాయి. ఇలా బాలయ్య అభిమానిని విలన్ చేసి అతన్ని కుక్కని కొట్టినట్టు కొట్టిన హీరో అన్న రేంజ్ ఎలివేషన్ మెగాస్టార్ ఫ్యాన్ ని సినిమాలో ఎలివేట్ చేశారు.

దీనితో ఓటిటిలో వచ్చాక ఈ సినిమాని చూసిన మెగా అభిమానులు కూడా ఒకింత షాక్ కి గురవుతున్నారు. బాలయ్యపై ఇలాంటి సీన్ అది కూడా ఎన్టీఆర్ బావమరిది సినిమాలో పెట్టడం ఒక స్ట్రేంజ్ గా ఉందని మెగా అభిమానులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ మాస్ సీన్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా, ఆగస్టు 15వ తేదీ సందర్భంగా రిలీజైన ఆయ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది.


Click it and Unblock the Notifications











