Waltair Veerayya: ఓటీటీలోనూ పూనకాలు తెప్పిస్తున్న చిరు సినిమా.. ట్రెండింగ్ లో రికార్డ్!

దాదాపు 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. అలాగే రెండు రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా అక్కడ సత్తా చాటుతూ దూసుకుపోతోంది.

2023 కొత్త సంవత్సరం ఆరంభంలోనే వాల్తేరు వీరయ్యగా సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ ఆకట్టుకున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించి సాలిడ్ హిట్ కొట్టారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Chiranjeevi Waltair Veerayya Number One Position In Netflix Trending List

వాల్తేరు వీరయ్య సినిమాకు మొదటి నుంచే మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి నటన.. రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులకే కాకుండా ప్రేక్షకులకు సైతం ఎంతో బాగా ఎంటర్టైన్ చేశాయి. అలాగే ఈ సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడంతో వసూళ్లు కూడా బాగా కలెక్ట్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.93 కోట్లు షేర్‌, రూ. 232.15 కోట్లు గ్రాస్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 6తో 25 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 27న ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన విషయం తెలిసిందే.

Chiranjeevi Waltair Veerayya Number One Position In Netflix Trending List

థియేటర్లలో అదరగొట్టిన వాల్తేరు వీరయ్య ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో పూనకాలు సృష్టిస్తున్నాడు. ఇండియా వైడ్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లో నెంబర్ వన్ స్థానంలో వాల్తేరు వీరయ్య ట్రెండ్ అవుతూ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో థియేటర్స్ తర్వాత ఓటీటీలో కూడా వీరయ్య హవా చాటుతున్నాడని అర్థం అవుతోంది. అయితే తొలి రోజు పెద్దగా రెస్పాన్స్ రాకున్నప్పటికీ రెండో రోజు నుంచి అదరగొడుతోంది ఈ చిత్రం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ నెంబర్ వన్ పొజిషన్ లో నిలబడి.. మరోసారి మెగా మేనియా పవర్ చూపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X