For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Cobra Movie OTT: ఆ ఓటీటీలో విక్రమ్ కోబ్రా స్ట్రీమింగ్.. ఏ భాషల్లో రాబోతుందంటే!

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు నలభై ఏళ్లుగా సౌతిండియాలోనే స్టార్ హీరోగా వెలుగొందుతూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న హీరో చియాన్ విక్రమ్. పేరుకు తమిళ హీరోనే అయినా అన్ని భాషల్లోనూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఏజ్ బార్ అవుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకు సరైన హిట్ మాత్రం అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది 'మహాన్' అనే చిత్రంతో వచ్చినా.. అది ఓటీటీలోనే విడుదలైంది.

  ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

  చాలా కాలంగా భారీ సక్సెస్‌ కోసం వేచి చూస్తోన్న చియాన్ విక్రమ్ ఇటీవలే 'కోబ్రా' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సైంటిఫిక్ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రానికి భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ క్రేజీ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అత్యధికంగానే జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే.

  Chiyaan Vikram Cobra Movie Streaming on Sony LIV From September 28th

  క్రేజీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కోబ్రా' మూవీ అనుకున్నట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. కానీ, ఆరంభంలోనే దీనికి మిక్స్‌డ్ టాక్ రావడం స్పందన చాలా తక్కువగా వచ్చింది. ఫలితంగా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణలో అంతగా కలెక్షన్లు రాలేదు. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు ఆదరణ కరువైంది. దీంతో ఈ సినిమాకు ముగింపు సమయానికి చాలా తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరలేకపోయింది.

  హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

  థియేటర్లలో అంతగా సందడి చేయలేకపోయిన విక్రమ్ 'కోబ్రా' మూవీని త్వరగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఎన్నో సంస్థలతో డీల్స్ మాట్లాడారని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీన్ని సెప్టెంబర్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అందులో వెల్లడించింది. ఈ మేరకు కొత్తగా రెడీ చేసిన ఓ ట్రైలర్‌ను కూడా సదరు సంస్థ విడుదల చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  Chiyaan Vikram Cobra Movie Streaming on Sony LIV From September 28th

  చియాన్ విక్రమ్ - ఆర్ అజయ్ జ్ఞానముత్తు కలయికలో రూపొందిన చిత్రమే 'కోబ్రా'. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లెజెండరీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌ను ఇచ్చారు.

  English summary
  Kollywood Star Vikram Did Cobra Movie Under R. Ajay Gnanamuthu Direction. This Movie Streaming on Sony LIV From September 28th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X