Thangalaan OTT: ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Thangalaan OTT: థియేటర్స్ ల్లో సినిమా రిలీజ్ అవుతుందో లేదా.. ఓటీటీలో కేవలం నెలరోజుల గ్యాప్ లోనే ప్రత్యేక్షం అవుతున్నాయి. కొన్ని సినిమాలయితే.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం కనీసం ఇంత టైం అని ముందుగానే ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చి.. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తాజాగా సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఆ మూవీనే తమిళ్ సూపర్ హిట్ మూవీ తంగలాన్ .ఇంతకీ ఆ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోంది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్,సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'తంగలాన్'(Thangalaan). ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న వర్డల్ వైడ్ గా విడుదలయ్యింది. చియాన్ విక్రమ్ అడ్వెంచరస్ యాక్టింగ్‌కు, డైరెక్టర్ పా రంజిత్ టేకింగ్ కు ఫిదా అయిపోయారు మూవీ లవర్స్. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్. ఇలా కలిసి రావడంతో మూవీ మేకర్స్ కు అనుకొని విధంగా లాభాలు పడిపడుతున్నాయి.

ఇంతకీ మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటంటే.. ఇండియన్ హిస్టరీలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)కు ప్రత్యేక స్థానముంది. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో బంగారు నిక్షేపాల అన్వేషణ, ఆ సమయంలో అక్కడ నివసిస్తున్న గిరిజనుల జీవన పరిస్థితులు, భూస్వామ వ్యవస్థ, బ్రిటీష్ ప్రభుత్వ పాలన బేస్ చేసుకుని ఈ మూవీని రూపొందించారు. అప్పటి పరిసస్థితులకు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు రంజిత్. ఈ థ్రిల్లింగ్, అడ్వెంచరస్ కోసంప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీ కోసం సుమారుగా 140 కోట్లు వెచ్చించారు.
ఈ చిత్రంలో హీరో విక్రమ్ కు జంటగా పార్వతి నటించగా.. మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూల్ చేసింది తంగలాన్. ఇప్పటికీ ఈ మూవీ కొన్ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. తంగలాన్ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. సెప్టెంబర్ చివరివారంలో గానీ, నవంబర్ మొదటి వారంలో గాని ఈ మూవీ ఓటీటీలో దర్శనం ఇవ్వనున్నది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో విడుదల కానున్నదట. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.


Click it and Unblock the Notifications











