OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి విక్రమ్ "తంగలాన్" .. ఇంత గ్యాప్ ఎందుకు?

ఇటీవల మన తెలుగు సినిమాలు గ్లోబల్ లెవెల్లో సెట్ చేసిన స్టాండర్డ్స్ చూసి ఇతర భాషల్లో చేసిన పలు చిత్రాలు కూడా తమ సినిమాలు గ్లోబల్ లెవెల్లో సక్సెస్ అవుతాయి అని చెబుతూ వచ్చాయి. కాగా ఈ తరహా చిత్రాలు ఎక్కువగా తమిళ చిత్రాలు నుంచి వచ్చాయి అని చెప్పాలి. మరి రీసెంట్‌గానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ చిత్రం "కంగువా" ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.

గ్లోబల్ గా 1000 కాదు 2000 కోట్లు కొల్లగొడతాం అని చెప్పిన మేకర్స్ బొక్క బోర్లా పడ్డారు. ఈ సినిమా కంటే ముందు తమిళ్ నుంచి వచ్చిన మరో భారీ సినిమా ఏకంగా తమకి ఆస్కార్ అవార్డు తీసుకొస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు చిత్రాలు కూడా ఒకే నిర్మాణ సంస్థ నుంచి రావడం విశేషం. ఈ నిర్మాతలు ఎంతో లేపినా ఈ సినిమాలు ఆ అంచనాలకి తగ్గట్టుగా రీచ్ కాలేకపోయాయి.

chiyaan vikram thangalaan comes in this ott surprisingly here you can watch

మరి ఆ రెండో సినిమా ఏదో కాదు తమిళ ఇండస్ట్రీలో నటన అంటే ప్రాణం పెట్టేసే వెర్సటైల్ నటుడు విక్రమ్ నటించిన "తంగలాన్" సినిమానే. కాగా ఈ చిత్రాన్ని కబాలి, కాలా, సార్పట్టలు తీసిన దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించగా ఈ సినిమా ఆస్కార్ తీసుకొస్తుంది అనే రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తూ రిలీజ్ కి తీసుకొచ్చారు. కానీ ఈ చిత్రం వాటి రేంజ్ లో లేదని ఆడియెన్స్ ఫీడ్ బ్యాక్ ఇచ్చేసారు.

ఇలా ఈ ఏడాది ఎపుడో ఆగష్టు లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ గానే మిగిలిపోయింది. అయితే నాటి నుంచి ఈ చిత్రం ఇదిగో ఓటిటిలో వస్తుంది. అదిగో ఓటిటిలో వస్తుంది అని టాక్ వచ్చింది కానీ ఇప్పటి వరకు రాలేదు. అయితే ఆ మధ్య చిత్ర యూనిట్‌కి ఓటిటి సంస్థకి ఏదో డీల్ కుదరక నెల లోపే రావాల్సిన ఈ చిత్రం ఇన్ని నెలలు అయినా ఇంకా స్ట్రీమింగ్ జరగలేదు.

ఈ నేపథ్యంలో "తంగలాన్" సర్‌ప్రైజ్ అండ్ సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఈ సినిమాని అప్పట్లో భారీ ధర ఇచ్చి సొంతం చేస్తున్న ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌లోనే ఈరోజు నుంచి ఈ భారీ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో కాకుండా పాన్ సౌత్ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.

సో ఈ సినిమాని అప్పుడు థియేటర్‌లలో మిస్ అయ్యినవాళ్లు ఒకసారి లుక్ వేయొచ్చు. కాగా ఈ చిత్రంలో బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ నటించి.. చాలా మందిని సర్‌ప్రైజ్ చేసింది. కాగా ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్‌ని కూడా అనౌన్స్ చేశారు. మరి మొదటి సినిమానే కాస్ట్ ఫెయిల్యూర్ దీంతో పార్ట్ 2 వస్తుందో లేదో అన్న అనుమానాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Read more about: vikram malavika mohanan pa ranjit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X