Thangalaan OTT: ముందుగానే ఓటీటీలోకి విక్రమ్ ‘తంగలాన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Thangalaan OTT: రోజురోజుకు ఓటీటీల క్రేజ్ పెరిగిపోతుంది. థియేటర్స్ ల్లో సినిమా రిలీజ్ అవుతుందో.. లేదా.. ఓటీటీలో కేవలం 20 లేదా 30 రోజుల్లో ప్రత్యేక్షమతుంది. కొన్ని సినిమాలు అయితే..మరీ తరుణం కేవలం వారం పది రోజుల్లోనే ఓటీటీలో కనిపిస్తాయి. సక్సెస్ పుల్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం కనీసం కొంత సమయం తీసుకుంటున్నాయి. ఆ టైంను ముందుగానే అనౌన్స్ చేస్తాయి. ఇలా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చి.. ఓటీటీ ఫ్యాన్స్ కు పుల్ టైం ఎంటర్టైన్ అందిస్తున్నాయి. తాజాగా మరో బ్లాక్ బాస్టర్ మూవీ ఓటీటీలో దర్శనమివ్వనున్నది. ఆ సినిమానే తమిళ్ సూపర్ హిట్ మూవీ తంగలాన్ . విక్రమ్ తన నట విశ్వరూపం చూపించిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నదో మీరు కూడా ఓ లూక్కేయండీ..

తమిళ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్- సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ కాంబో‌లో తెరకెక్కిన సినిమా 'తంగలాన్'(Thangalaan). పీరియాడికల్ అడ్వెంచెరస్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని 'స్టూడియో గ్రీన్' బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న వర్డల్ వైడ్ గా విడుదలయ్యింది. చియాన్ విక్రమ్‌ అడ్వెంచరస్‌ యాక్టింగ్‌కు, డైరెక్టర్ పా రంజిత్ టేకింగ్ కు ఫిదా అయిపోయారు మూవీ లవర్స్‌. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరో ప్లస్. దీంతో తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది తంగలాన్ మూవీ. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చేశాయి.

Chiyan Vikram and Pa Ranjith combo latest movie Thangalan is likely available on OTT from September 20

ఇలా అన్ని కలిసి రావడంతో మూవీ మేకర్స్ కు కాసులు కురిపించింది ఈ మూవీ. తమిళంలో తంగలాన్ ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దక్షిణాదినా సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఇటీవలే హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఉత్తరాదినా కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కాసులు కురిపించిన తంగలాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఓటీటీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ క్రమంలో తంగలాన్ టీమ్ కు భారీ షాక్ తగిలింది. తంగలాన్ సినిమా హెచ్ డీ ప్రింట్ లీక్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ టీం ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.

సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన 4 లేదా 6 వారాల తర్వాతే సినిమా ఓటీటీలోకి రావాలి. అలా ఆరు వారాల తర్వాతే తంగలాన్ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. ఈ భారీ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 20 నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు పోస్టర్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సమాచారం మేరకే అధికారిక ప్రకటన రాబోతుందని ప్రచారం జరుగుతోంది.

Chiyan Vikram and Pa Ranjith combo latest movie Thangalan is likely available on OTT from September 20

ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే.. భారతదేశ చరిత్రలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్‌)కు ప్రత్యేక స్థానముంది. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం నిక్షేపాల అన్వేషణ, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జీవన పరిస్థితులు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వ పాలన ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు దర్శకుడు రంజిత్ చూపించారు . ఈ మూవీ కోసం ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీ కోసం సుమారుగా 140 కోట్లు వెచ్చించారు. ఈ మూవీలో హీరో విక్రమ్ కు జంటగా పార్వతి నటించగా, మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రలో నటించారు.

More from Filmibeat

Read more about: vikram thangalaan ott platform
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X