Citadel Honey Bunny Trailer Review: అదిరిపోయే యాక్షన్‌తో సమంత.. సిటాడెల్ ట్రైలర్ రివ్యూ!

ప్రముఖ నిర్మాణ సంస్థలు డీ2ఆర్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ బ్యానర్‌పై ది రూసో బ్రదర్స్, రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న చిత్రం సిటాడెల్ హానీ బన్నీ. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత రుత్ ప్రభు, బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కేకే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీం, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, కాశ్వీ మజుందార్ తదితరులు నటించారు. ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ఆడియెన్స్‌ అభిరుచికి తగినట్టుగా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది.

Citadel Honey Bunny Trailer Review in Telugu Samantha Ruth Prabhu stunning in high-octane spy thriller

సిటాడెల్: హని బన్నీ ట్రైలర్ విషయానికి వస్తే.. అత్యంత సాంకేతిక నైపుణ్యంతో స్పై థ్రిల్లర్‌గా రూపొందింది. 90 దశకంలో సాగే కథలో ఒళ్లు జలదరించే గురిచేసే యాక్షన్ సన్నీవేశాలు, సీట్లకు అత్తుకుపోయి చూసేలా స్టంట్స్, బైక్ రేసింగులతో ట్రైలర్ క్లాస్, మాస్ అంశాలతో కనిపించింది. ట్రైలర్‌లో చూసిన సన్నివేశాలు, విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి.

సిటాడెల్ ట్రైలర్ చూస్తే.. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకొనే వర్థమాన తార హానీగా సమంత, అలాగే స్టంట్‌మన్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపించారు. రోజుకో ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదాలు ఒకదానికి మించి మరొకటి ఉంటుంది. ఆ ప్రమాదాలు నిన్ను నాశనం చేస్తాయా? లేదా నువ్వే వాటిని అంతమొందిస్తావా? అనే ప్రశ్న అని వరుణ్ ధావన్ అనడం కనిపించింది.

తన బిడ్డను రక్షించుకోవడానికి తల్లిగా సమంత చేసే పోరాటం ఎక్సైటింగ్‌గా ఉంటుంది. నేను ఓ ఎంజెట్ అంటూ కూతురు పరిచయం చేసుకొంటే.. .జెమ్స్ బాండ్ మాదిరిగానా? అని కూతురు నాడియా ప్రశ్నిస్తూ కనిపిస్తుంది. ఇక వరుణ్ ధావన్‌ను నీవు ఏజెన్సీలోకి ఎలా వచ్చావు? అని అడిగితే.. బాబా అంటూ సమాధానం చెబుతాడు. ఇలాంటి ఎమోషన్స్ మధ్య యాక్షన్ సన్నివేశాలు హైరేంజ్‌లో ఉన్నాయనే ఫీలింగ్ కల్పించింది. యాక్షన్ లవర్స్‌కు ఈ సిరీస్ కొత్త అనుభూతిని పంచుతుందనే ఫీలింగ్ కల్పించింది.

Citadel Honey Bunny Trailer Review in Telugu Samantha Ruth Prabhu stunning in high-octane spy thriller

సిటాడెల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. గ్రిప్పింగ్ స్టోరీ లైన్, యాక్షన్ ప్యాక్ట్ ఎంటర్‌టైనర్‌లో భాగం కావడం హ్యాపీగా ఉంది. బలమైన పాత్రలు, నువ్వా? నేనా అనే విధంగా సాగే ఫైట్స్, స్టంట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఎన్నో కోణాలు ఉన్న స్పై థ్రిల్లర్ మూవీలో నటించడం కొత్త అనుభూతికి గురి చేసింది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X